NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఇవాళ రోజ్‌గార్‌ మేళా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందినవారికి నియామక పత్రాలు ఇవ్వనున్న ప్రధాని మోడీ

* విశాఖ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన.. VMRDA ఏరీనాలో పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న రోజ్ గర్ మేళాను ప్రారంభించనున్న బండి సంజయ్

* ఖమ్మం: నేడు మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన

* ఖమ్మం: నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన

* ప్రకాశం : వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.. దోర్నాల మండలం కొత్తూరు వద్ద ఉన్న వెలిగొండ ప్రాజెక్టు సొరంగం పరిశీలన అనంతరం ప్రాజెక్టు ఫీడర్ కాలువ పరిశీలన. మార్కాపురం మండలంలోని గొట్టిపడియ డ్యామ్ పరిశీలించనున్న మంత్రులు.. ప్రాజెక్టు పురోగతిపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష….

* బాపట్ల : అద్దంకిలో మెగా జాబ్ మేళాను ప్రారంభించనున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్..

* తిరుమల: ఎల్లుండి శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు.. రేపు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టిటిడి

* విశాఖలో నేడు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర టూర్. ఆనందపురం (మం) ఫీల్డ్ బిజిట్… VNRDA లో ఉత్తరాంధ్ర జిల్లాల గనులు, ఎక్సైజ్ అధికారులతో సమీక్ష

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విజయవాడకు వెళ్లనున్నారు.

* రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమవుతారు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉదయం 10:00 గంటలకు రాజమహేంద్రవరం మున్సిపల్ ఆఫీస్ నందు “గోదావరి పుష్కరాలపై” జరిగే కార్యక్రమంలో పాల్గొనున్న టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.. మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జనసేన నాయకులతో గ్రాడ్యుయేట్స్ MLC ఎలక్షన్ కొరకు ఓటు నమోదుపై అవగాహన మీటింగ్‌లో పాల్గొంటారు.. సాయంత్రం 5 గంటలకు “వారణాసి”కి పయనం

* తూర్పు గోదావరి జిల్లా: నేటి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభం.. ఈ నెల 29 ఉ. 10 గంటల నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్‌తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పని సరి ..

* కడప : నేటి నుంచి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల పర్యటన. బెంగుళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ రానున్న జగన్. ఇడుపులపాయ లో జిల్లా పార్టీ నేతలతో సమావేశం. అనంతరం పులివెందుల లోని నివాసానికి చేరుకుంటారు. ఇటీవల మృతి చెందిన బాబాయ్ మనోహర్ రెడ్డి అత్త గారి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్..

* అనంతపురం : నేడు గుంతకల్లు మండలం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు.

* అనంతపురం : గుంతకల్ మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్ లో సాధారణ కౌన్సిల్ సమావేశం.

* విజయవాడ పర్యటనలో మంత్రులు పయ్యావుల కేశవ్ , సత్యకుమార్ .

* శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు.. ఇన్ ఫ్లో 31,789 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 67,427 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* కర్నూలు: సుంకేసుల జలాశయంకు తగ్గిన వరద.. ఇన్ ఫ్లో 13,930 క్యూసెక్కులు.. ఔవుట్ ఫ్లో 13,517 క్యూసెక్కులు.. 3 గేట్ల ఎత్తివేత

* నంద్యాల: నేడు శ్రీశైలంలో నందీశ్వరస్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు

* తిరుపతి: శాస్త్రోక్తంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వర‌స్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

* తిరుపతి: ఉదయం 11 గం.లకు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులతో మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమీక్ష..

* అమరావతి : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు.. పుంగనూరు అల్లర్ల కేసులో నమోదైన 2 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేసిన మిథున్ రెడ్డి

* ఏపీ హైకోర్టులో మాజీ ఎంపీ నందిగం సురేష్ మరో బెయిల్ పిటిషన్.. మంత్రి సత్యకుమార్ కాన్వాయ్ పై దాడి యత్నం ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని నందిగామ ముందస్తు బెయిల్ పిటిషన్.. నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు

* మరియమ్మ అనే మహిళా హత్య కేసులో బెయిల్ ఇవ్వాలన్న నందిగం సురేష్ పిటిషన్ పై కూడా నేడు హైకోర్టు విచారణ

* అమరావతి: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చేలా బెయిల్ షరతులు సడలించాలని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి దాఖలు చేసిన 2 పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ