NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు విశాఖకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్..

* హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి నేటి కార్యక్రమాలు.. ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ లో CMO అధికారులతో బ్రీఫింగ్.. మధ్యాహ్నం 2 గంటలకు స్పీడ్‌పై వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం. సాయంత్రం 5 గంటలకు గణేష్ నిమజ్జనం.. ఈద్ మిలాద్-ఉన్-నబీ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.. ఇన్‌ఫ్లో 2,62,462 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,65,233 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్‌ ఉత్పత్తి

* నేడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఒడిశా, ఏపీ తీరాలను చేరే అవకాశం.. రేపటి నుంచి ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు.. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

* ఈ రోజు కేసీఆర్ ను కలవనున్న ఎమ్మెల్సీ కవిత.. ఉదయం 10.30 కు బంజారాహిల్స్ నివాసం నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు బయల్దేరి వెళ్లనున్న కవిత

* నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద… 18 గేట్లు.. 5 అడుగుల మేర పైకి ఎత్తి 1,45,800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు.. ఇన్ ఫ్లో 1,95,212 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 1,95,212 క్యూసెక్కులు.

* నేడు మధ్యాహ్నం తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. కొలనుపాక, స్వర్ణ గిరి క్షేత్రాలను సందర్శించనున్న గవర్నర్. అనంతరం కలెక్టరేట్ లో ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీతలతో గవర్నర్ ప్రత్యేక సమావేశం.నల్గొండ జిల్లా..

* నేడు నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టూర్. క్యాంప్ కార్యాలయంలో ప్రజావాణిలో పాల్గొననున్న మంత్రి. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన. చిన్న సూరారంలో 33/11 కె.వి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, అనంతరం ఏఎంఆర్పీ 37, 39, 40 డిస్ట్రిబ్యూటరీలను పరిశీలించనున్న మంత్రి కోమటిరెడ్డి.

* విశాఖలో నేడు మంత్రి నారాలోకేష్ పర్యటన.. మధ్యాహ్నం వరకు కోర్టుకు హాజరు.. మధ్యాహ్నం తర్వాత పార్టీ కార్యాలయంలో సమీక్షలు…

* విశాఖ‌: నేడు జాతీయ స్థాయి ఆర్థిక స‌ద‌స్సు.. స‌ర్యుల‌ర్ ఎకాన‌మీ – పాల‌సీ టు ఇంప్లిమెంటేష‌న్ పేరుతో వ‌ర్క్ షాప్.. సెమినార్ లో వివిధ రంగాల నిపుణులు, సంస్థల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సుమారు 150 మంది భాగ‌స్వామ్యం

* ప్రకాశం : ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాలు, ముఖ్య అతిథులుగా హాజరుకానున్న జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ, ఏ విజయ రాఘవన్..

* ప్రకాశం : ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో బాలల హక్కులపై బంగారు బాల్యం పేరిట ప్రత్యేక వర్క్ షాప్, ముఖ్య అతిథిగా హాజరుకానున్న నోబెల్ బహుమతి గ్రహీత, బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి..

* ఏలూరు జిల్లా: నేడు కేఆర్ పురం ఐటీడీఏలో గిరిజన గ్రీవెన్స్ డే .. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్..

* ఏలూరు: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏలూరులో 3కే రన్ .. ఇండోర్ స్టేడియం నుంచి ప్రారంభం కానున్న రన్

* నేడు గుంటూరులో పర్యటించనున్న ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి… ఏటుకూరు రోడ్డు లోని జిల్లా కార్యాలయంలో కార్యవర్గ సమావేశంలో పాల్గొననున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు….

* నేడు కడప జిల్లాకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ఎర్రగుంట్ల మండలం కల్లమల్లలో జరిగే తెలుగు భాషా దినోత్సవంలో పాల్గొననున్న మాజీ ఉపరాష్ట్రపతి.

* కడప : నేడు తెలుగు భాష దినోత్సవం… తెలుగు శాసనం లభించిన యర్రగుంట్ల మండలంలోని కలమల్ల లో తెలుగు భాష దినోత్సవం వేడుకలు… ముఖ్య అతిధిగా హాజరు కానున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..

* అనంతపురం : రాప్తాడు మండలం అయ్యవారి పల్లిలో వ్తెభవంగా ప్రారంభమ్తెన గొటుకూరప్ప జాతర.

* శ్రీ సత్యసాయి : చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రామదేవత కొల్లాపురమ్మ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు.

* రేపు పల్నాడులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పర్యటన.. నరసరావుపేట మండలం, కాకానిలో వనమహోత్సవం లో పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం..

* నంద్యాల: నేడు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీశైలం దేవస్థానం వైదిక కమిటీ సూచనతో స్వర్ణరథోత్సవం.. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం మాడవీధులలో స్వర్ణరథోత్సవం .. స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్న అది దంపతులు.. ప్రతి మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు స్వర్ణరధోత్సవం నిర్వహించేందుకు దేవస్థానం నిర్ణయం

* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేడు స్వామి వారి మూలబృందావనంకు తుంగ జలంతో అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం, మహా మంగళహారతి వంటి విషేశ పూజలు.. సాయంత్రం ప్రహ్లదరాయులను నవరత్న స్వర్ణ రథంపై ఉరేగింపు.

* నంద్యాల: మార్కెట్ యార్డ్ నుండి స్టేడియం వరకు నేడు త్రీ కే రన్

* తిరుమల: 19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్‌ లేని భక్తులుకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,772 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 30,293 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు

* గుంటూరు: నేడు ఢిల్లీ లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో, ఎంపీ మోపిదేవి వెంకటరమణ… మధ్యాహ్నం స్పీకర్ ఫార్మట్ లో రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా సమర్పించే అవకాశం.

* విజయవాడ: నేడు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ర్యాలీ .. హాజరుకానున్న మంత్రి రాం ప్రసాద్ రెడ్డి, క్రీడాకారిణి పీవీ సింధు

* శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు ( మం ) డోకులపాడులో ప్రపంచ తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో కవి సమ్మేళనం, పాటల పోటీలు .

* శ్రీకాకుళం: నేడు పొందూరు మండల కార్యాలయం లో జనరల్ బాడి సమావేశం. పాల్గొననున్న ఎమ్మెల్యే కూన రవికుమార్ .

* విజయవాడ : నేడు నగరంలో తెలుగు భాషా దినోత్సవం వేడుకలు.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

* విజయనగరం: నేటు నుంచి ఆసుపత్రి లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు నిరసన.. నేడు నల్ల బ్యాజీలతో విధులకు హాజరుకావాలని నిర్ణయం.. ఉద్యోగాల పర్మినెంట్, అలాగా పలు డిమాండి నెరవేర్చే నిరసనలు వరకు కొనసాగించనున్నామని ఉద్యోగులు..

* విజయనగరం: నేడు జాతీయ క్రీడాదినోత్సవాన్ని వేడుకులు.. అయోధ్యా మైదానంలో హకీ పోటీలు.. రాజీవ్ స్టేడియంలో కరాటే పోటీలు.. విజ్జి స్టేడియంలో 2 కిలోమీటర్ల పరుగు పోటీ .. పోటీల్లో విజేతలకు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం..

* విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాయలసీమ‌కు చెందిన పలురు నేతలు నేడు బీజేపీలో చేరిక