NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు ఆకాశంలో సౌర కుటుంబంలోని ఏడు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి కనువిందు చేస్తాయంటున్న శాస్త్రవేత్తలు

* ఛాంపియన్స్‌ ట్రోఫీ: మధ్యాహ్నం 2.30 గంటలకు లాహోర్ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మ్యాచ్

* ఢిల్లీ: నేడు సుందర్ నర్సరీలో సూఫీ ఉత్సవంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ..

* హైదరాబాద్‌: ఇవాళ, రేపు గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్‌ సైన్స్‌ డే ఎగ్జిబిషన్‌.. ప్రారంభించనున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. డీఆర్‌డీవో, డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ ఉత్పత్తులకు చెందిన 200 స్టాల్స్‌ ప్రదర్శన.. డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ రంగంలో భారత సామర్థ్యాలను ప్రదర్శించేలా స్టాల్స్‌..

* అమరావతి : ఇవాళ ఉదయం 10 గంటలకు 2025 – 26 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం.. శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి కొల్లు రవీంద్ర. మండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి నారాయణ.

* అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం.. బడ్జెట్ తర్వాతభేటీ కానున్న టీడీఎల్పీ.. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, ఆమోదించాల్సిన బిల్లులపై చర్చ.. దాదాపు 20కి పైగా అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న టీడీఎల్పీ.

* హైదరాబాద్‌: పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌ అధ్యక్షతన గాంధీభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృతస్థాయి కార్యకర్త సమావేశం.. హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

* హైదరాబాద్‌: నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం

* అన్నమయ్య జిల్లా : రాయచోటిలో 6వ రోజుకు చేరుకున్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు… 6వ రోజు సందర్భంగా ఉదయం చండిహోమం.. సాయంత్రం పుష్పోత్సవం… ఉత్సవాలల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలతో పాటు తెలుగు రాష్ట్రాల కు చెందిన భక్తులు…

* పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించిన రైల్వేకోడూరు మేజిస్ట్రేట్.. మార్చి 13వ తేదీ వరకు రిమాండ్..

* విజయవాడ: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ.. కౌంటర్లు దాఖలు చేయనున్న పోలీసులు..

* తిరుపతి: నేడు వైకుంఠా ఏకాదశి టికెట్లు జారీ సమయంలో జరిగినా తొక్కిసలాట ఘటనపై పద్మావతి పార్క్ సమీపంలోని షాపు యజమానులను వర్చువల్ గా విచారించనున్న జస్టిస్ సత్యనారాయణ మూర్తి కమిషన్‌

* నేడు గుంటూరులో సాయి సాధన చిట్ఫండ్ చీటింగ్ పై సిఐడి విచారణ.. బాధితుల నుంచి వివరాలు సేకరించనున్న సిఐడి అధికారులు… చిట్ ఫండ్ బాధితుల వద్ద ఉన్న ఆధారాలు సమర్పించాలని, సిఐడి అధికారుల నుండి ఫోన్లు…

* పుదుచ్చేరి: పుదుచ్చేరిలో 60 కోట్ల క్రిప్టోకరెన్సీ స్కామ్‌కు సంబంధించి హీరోయిన్ తమన్నా, కాజల్ అగర్వాల్‌లను విచారించనున్న పుదుచ్చేరి సైబర్ క్రైం పోలిసులు

* శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం నేడు శ్రీముఖలింగ క్షేత్రంలో చక్ర తీర్థ స్నానాలు.. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు చక్ర తీర్థ స్నాన ఘట్టం.. వంశధార నదిలో స్వామివారికి జలాభిషేకం

* తిరుమల: 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 58,627 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 15,468 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు

* కాకినాడ: నేటి నుంచి 5 వారాలపాటు కాకినాడ – చర్లపల్లి (07031) ప్రత్యేక రైలు.. ఈ నెల 28, వచ్చేనెల 7, 13, 21, 28 నడవనున్న స్పెషల్ ట్రైన్.. కాకినాడలో రాత్రి 7:20 కి బయలుదేరి తెల్లవారుజామున 4:30 కి చర్లపల్లి చేరుకోనున్న ట్రైన్

* కర్నూలు: నేడు కోడుమూరు హంద్రీనది తీరంలోని తాగునీటి పథకాలను పరిశీలించనున్న నీటిపారుదల శాఖ అధికారులు

* కర్నూలు: మంత్రాలయంలో గ్రామ దేవత మంచాలమ్మకు నేడు కుంకుమ అర్చన, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి ప్రత్యేక పూజలు.. అమ్మవారికి చీర జాకెట్టు గాజులు, పసుపు, కుంకుమ, పూలు సమర్పించి మొక్కులు తీర్చుకోనున్న మహిళలు.

* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు మహా రథోత్సవం

* కర్నూలు: ఓర్వకల్లు (మం) కాల్వబుగ్గ క్షేత్రంలో నేడు భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గరామేశ్వర స్వామి రథోత్సవం..

* నంద్యాల: నేడు శ్రీశైలంలో 10రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఉదయం బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం, వసంతోత్సవం.. సాయంత్రం సదస్యం, నాగవల్లి బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానిస్తు కట్టిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణ