* లాహోర్ వేదికగా నేడు ఇంగ్లండ్ – ఆఫ్గనిస్తాన్ ఢీ.. మధ్యాహ్నం 2.30కి మ్యాచ్
* ఇవాళ్టితో ముగియనున్న మహాకుంభమేళా.. శివరాత్రి సందర్భంగా స్నానాలకు పోటెత్తిన భక్తులు.. రద్దీతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన యూపీ సర్కార్.. నో వెహికల్ జోన్‌గా కుంభమేళా ప్రాంగణం
* చెన్నై: నేడు విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో పోత్తులపై, ప్రచార యాత్రలపై విజయ్ కీలకమైన ప్రకటన చేస్తారని సమాచారం… చెన్నై మామల్లపురంలో సభ… పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ సహా రాజకీయ వ్యూహకర్త ,టీవీకే పార్టీ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ ,ఇతర నేతలు… సభకు మూడు వేలమంది హాజరయ్యే అవకాశం…
* శివరాత్రి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు..
* ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉదయం 10:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ.. బీసీ కులగణన రిజర్వేషన్లు, రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు నిధులపై ప్రధానితో చర్చించనున్న సీఎం రేవంత్..
* విజయవాడ: నేడు వల్లభనేని వంశీని రెండో రోజు కస్టడీ కి తీసుకోనున్న పోలీసులు.. ఉదయం 10 నుంచి సాయత్రం 5 గంటల వరకు కస్టడీ.. వంశీ సహా మరో ఇద్దరి నిందితులను కూడా విచారించనున్న పోలిసులు.. రేపటితో ముగియనున్న పోలీస్ కస్టడీ
* ఖమ్మం జిల్లాలో శివ నామస్మరణ తో మర్మోగుతున్న శివాలయాలు.. గుంటి మల్లన్న , బ్రాహ్మణ బజార్ శివాలయం, తీర్థాల సంగమేశ్వరలయం, కూసుమంచి గణపేశ్వరాలయం, వైరా స్నానాల లక్ష్మి పురం శివాలయం, పెనుబల్లి నీలాద్రీశ్వరాలయంలో భక్తులతో నిండిన ఆలయాలు
* రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ.. దర్శనం ఏర్పాట్లలో అధికారుల సమన్వయ లోపం.. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల అవస్థలు.. అధికారులతో వాగ్వాదానికి దిగిన భక్తులు
* రాజన్నసిరిసిల్ల జిల్లా: భక్తుల శివనామ స్మరణతో మారుమోగుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం.. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడుతున్న రాజన్న ఆలయం.. స్వామివారికి కోడె మొక్కలు చెల్లించి, స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరిన భక్తులు
* వరంగల్: నేటి నుంచి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు వరుస సెలవులు.. 26 మహాశివరాత్రి, 27 శివరాత్రి జాగరణ, 28 శుక్రవారం అమావాస్య, 1, 2, శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు..
* ఉమ్మడి మెదక్ జిల్లాలో శివరాత్రి సందర్భంగా కిటకిటలాడుతున్న శివాలయాలు.. శివనామ స్మరణతో మారుమోగుతున్న సంగారెడ్డి జిల్లా ఝారాసంఘం కేతకి సంగమేశ్వర ఆలయం.. రుద్రారం గణేష్ టెంపుల్ లో భక్తుల రద్దీ.. ఫసల్ వాదీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ప్రత్యేక ఆకర్షణగా కోటి 8 లక్షల రుద్రాక్షలతో తయారు చేసిన శివలింగం
* మెదక్ జిల్లా ఏడుపాయలలో ఘనంగా ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు..
* సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి ఉదయం నుంచే బారులు తీరిన భక్తులు
* నిజమాబాద్ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. నీల కంటేశ్వరాలయం, శంభుని గుడి, బోధన్ ఏక చక్రేశ్వర ఆలయం, పోచం పాడ్ రామ లింగేశ్వర ఆలయం, ఆర్మూర్ లోని నవనధుల సిద్ధుల గుట్ట, కామారెడ్డి లోని భీమేశ్వరాలయం, బిక్క నురు సిద్ద రామేశ్వరాలయలో భారీ ఏర్పాట్లు
* జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం క్షేత్రంలో మహాశివరాత్రి శోభ. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి కాళేశ్వరం తరలివస్తున్న భక్తులు. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు.గోదావరి మాతకు ప్రత్యేక పూజలు.
* కడప : రెండవ రోజు పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన… పులివెందుల పట్టణంలోని రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించనున్న జగన్
* ఇవాళ పులివెందుల పర్యటన ముగించుకుని బెంగుళూరుకు వెళ్లనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్..
* తిరుమల: ఇవాళ గోగర్బం డ్యాం వద్ద వున్న క్షేత్రపాలకుడికి ప్రత్యేక పూజలు
* ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం లోని క్యాంప్ కార్యాలయంలో ఉంటారు..
* ప్రకాశం : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా త్రిపురాంతక క్షేత్రంలో భక్తుల రద్దీ.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.. జిల్లా వ్యాప్తంగా భైరవకోన, సోపిరాల, టంగుటూరు మండలం జమ్ములపాలెం సహా పలు శైవ క్షేత్రాల్లో తెల్లవారు జామునుంచే భక్తుల ప్రత్యేక పూజలు.. శివనామ స్మరణతో మార్మోగుతున్న శైవలయాలు..
* తిరుపతి: ఎస్వీ యూనివర్శిటిలో రెండు రోజులపాటు తెలుగు భాష సమావేశాలు….
* ప.గో:పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి శోభ.. తెల్లవారు జామున నుండి స్వామి వారి దర్శనానికి పోటెత్తిన భక్తులు శివ నామ స్మరణతో మారుమ్రోగుతున్న ఆలయం
* పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం పంచారామ క్షేత్రంలో శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు… భారీగా తరలివచ్చిన భక్తులు…
* తిరుపతి: మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబు అయినా శ్రీకాళహస్తి… మహాశివరాత్రి సందర్భంగా ఉదయం స్వామీ, అమ్మవార్లకు ఇంద్రవిమాన,చప్పర వాహనసేవలు.. రాత్రి బంగారు నందిపై స్వామీవారు,సింహ వాహనంపై తిరుమాఢ విధుల్లో విహరించనున్న అమ్మవారు… శివరాత్రి, నంది వాహాన సేవ నేపథ్యంలో భారీ భద్రత ఎర్పాటు చేసినా అధికారులు, తిరుపతి జిల్లా పోలీసులు
* తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. వేలాదిగా తరలివచ్చి గోదావరిలో పుణ్య స్థానాలు ఆచరిస్తున్న భక్తులు.. రాజమండ్రిలో కిటకిటలాడుతున్న స్నాన ఘట్టాలు.. భక్తులు పుణ్య స్నానాలతో కిక్కిరిసిన రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమీ ఘాట్, సరస్వతీ ఘాట్
* మహాశివరాత్రి సందర్భంగా గోదావరి గట్టు వైపు వచ్చే వాహనాలు రాకపోకలు నిలిపివేత.. మెయిన్ రోడ్డు మీదుగా భక్తులు వెళ్లే విధంగా ఏర్పాట్లు
* విజయనగరం జిల్లా: నెల్లిమర్ల మండలం పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం లో మహాశివరాత్రి పురస్కరించుకుని పోటెత్తిన భక్తులు..
* విజయనగరం: ఉదయం 09.00 గంటలకు మెంటాడ మండలం, జయతి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో జరిగే మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొననున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. సాయింత్రం 04.30 గంటలకు బొండపల్లి మండలం, కొత్తపాలెం గ్రామంలో జరిగే శ్రీ శ్రీ శ్రీ కృష్ణమ్మ పేరంటాలు జాతర మహోత్సవంలో పాల్గొంటారు
* గుంటూరు: మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు.. కోటప్పకొండ, అమరావతి, గోవాడ, క్వారీ, శైవ క్షేత్రలలో ప్రత్యేక పూజలు… కోటప్పకొండ లో ఏర్పాటు చేసిన భారీ ప్రభలు.. జిల్లా నుండి కోటప్పకొండ చేరుకునేందుకు చేరుకునేందుకు వేలాది గా సిద్ధమైన ప్రభలు…
* నంద్యాల: బనగానపల్లె (మం) యాగంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి క్షేత్రంలో స్వామి అమ్మ వార్లకు, పట్టు వస్త్రాలను సమర్పించనున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఇందిరమ్మ దంపతులు. అర్ధరాత్రి లింగోద్భవ విశేష అభిషేక ప్రత్యేక పూజలు బిల్వార్చన, రుద్రాభిషేకం మహా మంగళహారతి, సమర్పించ నున్న ఆలయ అర్చకులు.
* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు రాత్రి 10 గంటలకు లింగోద్భవ సమయంలో మహా రుద్రాభిషేకం, స్వామివారి కళ్యాణోత్సవం
* నంద్యాల: నేడు శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు.. సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు నందివాహనసేవ, ఆలయ ఉత్సవం.. రాత్రి 10 గంటలకు లింగోద్బవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీస్వామివారికి పాగలంకరణ .. రాత్రి 12 గంటలకు పార్వతి పరమేశ్వరుల మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం
* కర్నూలు: నేడు మంత్రాలయం శివాలయంలో మహా శివరాత్రి సందర్భంగా స్వామి వారికి గంగపూజ, తులసి అర్చన, బిల్వార్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం, మహా రుధ్రాభిషేకం వంటి విశేష పూజలు.
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం .. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,127 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,307 మంది భక్తులు.. హుండీ ఆదాయం 4.29 కోట్లు
* శ్రీ సత్యసాయి : నంబులపూలకుంట మాండలం గూటిబ్తెలు తిమ్మమ్మ మర్రిమానులో నేటి నుంచి మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు.
* శ్రీ సత్యసాయి : తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి సమీపంలోని కాటికోటేశ్వర స్వామి క్షేత్రంలో ప్రారంభమ్తెన మహాశివరాత్రి ఉత్సవాలు.
* అనకాపల్లి జిల్లా…. రావికమతం మండలం కళ్యాణపులోవ లో మహాశివరాత్రి పురస్కరించుకుని మూడు రోజుల పాటు పోతురాజు స్వామి పెద్దింటమ్మ జాతర.. ఉత్తరాంధ్ర నుంచి భారీగా తరలి రానున్న భక్తులు…. విశాఖ, అనకాపల్లి, చోడవరం,నర్సీపట్నం నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
* విశాఖ: RK బీచ్ లో మహాశివరాత్రి వేడుకలు… మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు… ప్రయాగ్ రాజ్ కుంభ మేళా నుంచి తెచ్చిన జలాలతో అభిషేకాలు…
* అనంతపురం : యాడికి మండలం కొనుప్పలపాడు గ్రామం లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం, వసంతోత్సవం, రథోత్సవం.
* అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటి కి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాక… రాయచోటిలో జరిగే శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పూజలు చేయనున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి దంపతులు… మహా శివరాత్రి సందర్భంగా పలు శివాలయాలను సందర్శించి పూజలు చేయనున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి…
* అన్నమయ్య జిల్లా : రాయచోటిలో 4వ రోజుకు చేరుకున్న శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు… 4వ రోజు జరగనున్న రుద్రహోమము, గజవాహనము, పురుషమృగ వాహనము, అఘోర లింగేశ్వర స్వామి వారికి లింగోద్బవ అభిషేకములు…
* నెల్లూరు జిల్లా: మహాశివరాత్రి సందర్భంగా శివ నామస్మరణతో మారుమొగుతున్న శివాలయాలు.. నెల్లూరులోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కాటేపల్లి.. మైపాడు బీచ్ లలో సముద్ర స్థానాలు ఆచరించి మహాశివుని దర్శించుకుంటున్న భక్తులు
* అన్నమయ్య జిల్లా : రాయచోటి లో ఘనంగా జరుగుతున్న శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు… 3వ రోజు సందర్భంగా సింహ వాహనం పై ఘనంగా ఊరేగిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు… స్వామి అమ్మవార్ల ను దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసిన భక్తులు…