NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* హైదరాబాద్‌: నేడు కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ పై సీపీ ఘోష్ విచారణ.. ఎంత మేర రుణాలు తీసుకున్నారు? ఎవరెవరికి చెల్లింపులు చేశారు? తదితర అంశాలపై కార్పొరేషన్‌ ఎండీ, ఈఎన్‌సీలను ప్రశ్నించనున్న కమిషన్.. డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌లోని చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్ల క్రాస్‌ ఎగ్జామినేషన్

* అమరావతి: ఏపీ హైకోర్టులో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్.. ముంబై సినీ నటి జిత్వానీ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన గున్ని.. నేడు విచారణ

* నేడు పాలమూరు ప్రాజెక్టుల పరిశీలనకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. మొదట ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌ను పరిశీలించనున్న ఉత్తమ్

* నేడు ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటన.. గడిగడ్డ ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్‌ను సందర్శించనున్న సీతక్క.. ఉదయం 11 గంటలకు ఏటూరు నాగారంలో చాలి ఐలమ్మ విగ్రహావిష్కరణ.. మ.3 గంటలకు కలెక్టరేట్‌లో మినీ మేడారం జాతర సమన్వయ సమావేశం.. సాయంత్రం 5 గంటలకు ములుడు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సీతక్క

* ఈరోజు హైదరాబాద్ సిటీలో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పర్యటన.. ఉదయం 9గంటలకు తెలంగాణ భవన్ నుంచి సిటీ ఎమ్మెల్యేలతో కలసి ఫతేనగర్, కూకట్‌పల్లికి వెళ్లనున్న కేటీఆర్.. బీఆర్ఎస్ బృందంతో కలసి STP ప్లాంట్ లను పరిశీలించున్న కేటీఆర్.. తర్వాత కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు ఆఫీస్ లో ప్రెస్ మీట్..

* ఏపీ హైకోర్టులో జోగి రమేష్ బాబాయ్ జోగి వేంకటేశ్వర రావు ముందస్తు బెయిల్ పిటిషన్.. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏ1గా ఉన్న జోగి వేంకటేశ్వర రావు.. నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు

* ఏపీ హైకోర్టులో సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు ముందస్తు బెయిల్ పిటిషన్లు.. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏసీబీ, సీఐడీ కేసుల్లో నిందితుడుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు.. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు.. నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు

* అమరావతి: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు

* నేడు తిరుమలకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా తిరుమలలోనే మకాం వెయ్యనున్న దేవాదాయశాఖ మంత్రి..

* విశాఖ: నేటి నుంచి మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పర్యటన.. CII ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో ముఖ్య అతిథిగా లోకేష్.. సాయంత్రం కాపుల ఉప్పాడలో అదానీ డేటా సెంటర్ భూములను పరిశీలించనున్న మంత్రి.. రాత్రికి పార్టీ కార్యాలయంలో బస..

* విశాఖ: తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ, జనసేన పోటా పోటీ కార్యక్రమాలు.. అంబేద్కర్ సర్కిల్ దగ్గర శ్రీ శ్రీనివాసుని క్షమాపణ మహా యజ్ఞం తలపెట్టిన దక్షిణ ఎమ్మెల్యే వంశీ యాదవ్.. GVMC గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ కార్పొరేటర్లు నిరసన ప్రదర్శన.

* విశాఖ: నేడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం.. అవినీతి ఆరోపణలతో మేయర్ రాజీనామా కు డిమాండ్ చేస్తున్న కూటమి.. ఆధారాలతో సహా నిరూపించాలని వైసీపీ కౌంటర్ ఎటాక్..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ..నెల్లూరు లోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు

* రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ.. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు

* శ్రీకాకుళం: నేడు పలాసలో సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత ‘ఐ ‘ మెడికల్ క్యాంపు నిర్వహించనున్న విశాఖలోని శంకర్ ఫౌండేషన్ వైద్యులు. కంటి సమస్యలతో బాధపడేవారిని గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ ..

* గుంటూరు: వివాదాస్పద గ్రీన్ గ్రేస్ నిర్మాణాల్లో, నగరపాలక సంస్థ అధికారులు, రైల్వే ఇంజనీర్లు కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడానికి నిర్ణయం… తీసుకున్న అనుమతులు, చేసిన నిర్మాణాలపై కూలంకుషంగా తనిఖీలు చేయనున్న రైల్వే మరియు నగరపాలక సంస్థలు నేడో, రేపో క్షేత్రస్థాయి పరిశీలన జరిగే అవకాశం…

* ప్రకాశం : మర్రిపూడి మండలం అయ్యప్పురాజుపాలెంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి డోలా బాల విరాంజనేయ స్వామి..

* తూర్పుగోదావరి జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మోస్తరుగా కురుస్తున్న వర్షాలు

* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాళీ బజావో కార్యక్రమం..

* గుంటూరు : టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో, నేడు వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని విచారించనున్న ,మంగళగిరి రూరల్ పోలీసులు…

* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,616 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,759 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.89 కోట్లు

* విజయనగరం: నగరంలోని విజీ స్టేడియం లో నేడు స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు.. అండర్ 17 విభాగానికి క్రీడాకారులను ఎంపిక చేయునున్న నిర్వాహకులు..

* విజయనగరం: వచ్చే నెలలో అఖిలభారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) 49వ రాష్ట్ర మహాసభలు.. జయప్రదం చెయ్యాలని నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు..

* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు పార్వతీపురం పట్టణంలో 16వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పార్వతీపురం బోనేల విజయ్ చందర్

* శ్రీ సత్యసాయి : పరిగి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ

* తమిళనాడు ఘోర రోడ్డు ప్రమాదం.. వర్షంలో అతివేగంగా వెళ్లి కంట్రోల్ తప్పి చెట్టును ఢీకొట్టిన వ్యాన్‌‌.‌. ఆరుగురుమృతి, 14మంది తీవ్రమైన గాయాలు.. తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామీ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఉలుందూర్‌పేట సమీపంలోని మలుపు వద్ద ప్రమాదం