NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్.. ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా ప్రాంతాల మధ్య అర్ధరాత్రి 1.30 నుంచి 3.30 గంటల మధ్య తీరం దాటిన దానా తీవ్ర తుఫాన్.. తీరాన్ని తాకే సమయంలో గంటకు 110 కిలో మీటర్ల వేగంతో భీకర గాలులు.. తీరప్రాంత జిల్లాలైన భద్రక్‌, జగత్సింగ్‌పూర్, బాలాసోర్‌లో భారీ వర్షాలు..

* తీరం దాటిన “దానా”తీవ్ర తుపాన్.. ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

* హైదరాబాద్‌: నేడు సచివాయలంలో NICతో రెవెన్యూ అధికారుల సమావేశం.. ధరణి పోర్టల్ NICకి అప్పగించిన నేపథ్యంలో సాంకేతిక అంశాలు, రికార్డుల డిజిటలైజేషన్ వంటి అంశాలపై చర్చ

* హైదరాబాద్‌: నేడు సీఎస్‌తో ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా సమావేశం.. పాలనాపరంగా పరిష్కారం చేసుకునే అంశాలపై చర్చ.. 26వ తేదీన జరిగే కేబినెట్ సమావేశం లో.. ఉద్యోగుల సమస్యలపై చర్చ

* విశాఖలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పర్యటన.. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలు, పార్టీ నేతలతో సమావేశం.. అనంతరం మధ్యాహ్నం కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి, సమస్యలపై అధికారులతో చర్చ..

* మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు..

* ప్రకాశం : గిద్దలూరు మార్కెట్ యాడ్ లో రైతులకు సబ్సిడీ శనగలు పంపిణి కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి..

* బాపట్ల : మార్టూరు మండలం ఇసుకదర్శి లోని పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం.. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించనున్న ఎమ్మెల్యే..

* పల్నాడు: నేడు దాచేపల్లి మండలం , నారాయణ పురం ,అంజనాపురం కాలనీలో పర్యటించనున్న, ఆరోగ్యశాఖ మంత్రి ,సత్య కుమార్ యాదవ్.. డయేరియా ప్రభలడానికి, గల కారణాలను, అధికారులతో కలిసి పరిశీలించనున్న, మంత్రి సత్య కుమార్, ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావు..

* గుంటూరు: నేడు తెనాలిలో , టిడిపి సర్వసభ్య సమావేశం…

* రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నేడు విశాఖలో టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నంలో పర్యటన.. “CII టూరిజం & ట్రావెల్ summit-2024” కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి..

* తూర్పు గోదావరి జిల్లా: నేడు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం.. మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి సీపీఐ కార్యాలయంలో జరుగనున్న సమావేశం

* విజయవాడ పర్యటనలో ఉన్న మంత్రులు పయ్యావుల కేశవ్ , సత్యకుమార్, సవిత.

* తిరుమల: 9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,004 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,173 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు

* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. జలాశయం 5 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.. ఇన్ ఫ్లో 1,59,089 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 2,07,820 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* ఖమ్మం: నేడు భద్రాద్రి.. ఖమ్మం జిల్లాల్లో గవర్నర్ పర్యటన.. నేడు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోనున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ.. భద్రాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం కానున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. ఖమ్మం చేరుకుని కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, కవులు, కళాకారుల తో సమావేశం…

* భద్రాద్రి: నేడు భద్రాచలంలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కోదండరాం..

* నేడు ములుగు, మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి సీతక్క. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నా మంత్రి.

* నేడు మహబూబ్ నగర్ లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పర్యటన. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ శంకుస్థాపన చేయనున్న మంత్రి

* జూరాలకు కొనసాగుతున్న వరద. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో 71,713 వేల క్యూ సెక్కులు. ఔట్ ఫ్లో 76,667 వేల, క్యూ సెక్కులు. ఎగువ,దిగువ విద్యుత్ కేంద్రలలో 11 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదల.

* అమరావతి: నేడు ఏపీ హైకోర్టులో పలు కీలక పిటిషన్లు విచారణ.. మైన్స్ అక్రమాల కేసులో ఉన్న జేపీ వెంచర్స్ సంస్థ, అనిల్ ముందస్తు బెయిల్.. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ ముందస్తు బెయిల్.. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్.. మాజీ ఎంపీ నందిగామ సురేష్ బెయిల్ పిటిషన్ పై విచారణ

* అమరావతి: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల ముందస్తు బెయిల్ పై నేడు విచారణ.. LOC పేరుతో పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సజ్జల దాఖలు చేసిన మరో పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ