* ఛాంపియన్స్ ట్రోఫీ: నేడు ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా.. రావల్పిండి వేదికగా మధ్యామ్నం 2.30 గంటలకు మ్యాచ్
* ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ.. గత విచారణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌కు ఎంత సమయం కావాలని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
* అమరావతి: నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం.. సభ్యులు మాట్లాడిన తర్వాత సీఎం ప్రసంగం.. శాసనమండలిలో కూడా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం.. ఇవాళ శాసన మండలి సమావేశాలకు హాజరుకానున్న వైసీపీ ఎమ్మెల్సీలు
* హైదరాబాద్: నేడు ఎస్సీ వర్గీకరణపై సమావేశం.. ఉద్యమంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం చేయనున్న కాంగ్రెస్.. హరిత హోటల్ లో ఉదయం 11 గంటలకు సమావేశం
* నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
* నేటి నుంచి రెండు రోజులపాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన.. ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పులివెందులకు చేరుకుంటారు.. అనంతరం పులివెందులలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు.. రేపు ఉదయం 10 గంటలకు పులివెందుల పట్టణంలోని గుంత బజార్ లో ఉన్న వైయస్సార్ పౌండేషన్ మరియు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునికరించిన వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభిస్తారు.. 12.20కి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు వెళ్లనున్న జగన్..
* అన్నమయ్య జిల్లా : రాయచోటిలో 3వ రోజుకు చేరుకున్న శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు.. నేడు ఉదయం నవగ్రహ హోమం, యాళి వాహనోత్సవం… రాత్రి సింహ వాహనోత్సవం.. భక్తులతో కిటకిటలాడుతున్న వీరభద్ర స్వామి ఆలయం. మార్చి 5 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు…
* గుంటూరు: నేటితో ముగియనున్న గుంటూరు – కృష్ణా ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం… ఈనెల 27వ తేదీన జరగనున్న పోలింగ్.. నేటి సాయంత్రం తో ముగియనున్న ప్రచార సమయం ..
* విజయవాడ: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ.. కౌంటర్ దాఖలు చేయనున్న పోలీసులు.. నేడు వాదనలు జరిగే అవకాశం
* విశాఖ: నేటితో ముగియనున్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం… బరిలో 10మంది అభ్యర్థులు.. ముగ్గురు మధ్యే హోరాహోరీ.. రాజకీయ పార్టీల ప్రమేయంతో ఉత్కంఠగా మారిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు.
* ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా 48 గంటలపాటు మూత పడనున్న మద్యం షాపులు.. నేటి సాయంత్రం 4.00 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు వైన్ షాపులు క్లోజ్..
* ప గో: మహాశివరాత్రి సందర్భంగా భీమవరం, పాలకొల్లు పంచారామ క్షేత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు.. మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివారి దర్శనం కోసం భారీ సంఖ్యలో ఆలయాలకు చేరుకోనున్న భక్తులు..
* విజయవాడ: నేటితో ముగియనున్న వంశీ రిమాండ్.. మెజిస్ట్రేట్ ఎదుట నేరుగా లేదా వర్చువల్ విధానంలో హాజరుపరచనున్న పోలిసులు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉదయం 10 గంటలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి మీడియా సమావేశం.
* తిరుపతి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీకాళహస్తి దేవస్థానం లో స్వామి అమ్మ వారికీ పట్టు వస్త్రాలు సమర్పించనున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..
* తిరుమల: 4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనంకు 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,764 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,504 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు
* నేడు శ్రీశైలంలో 7వరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఉదయం ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. సాయంత్రం గజావాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న ఆది దంపతులు.. రాత్రి శ్రీస్వామి అమ్మవారికి గ్రామోత్సవం
* నంద్యాల: మహానందిలో కామేశ్వరి దేవి సహిత మహనందిశ్వర స్వామి వారికి నేటి ఉదయం సూర్య ప్రభవాహన సేవ , మహానందీశ్వర అష్టోత్తరం, రాత్రి సింహ వాహన సేవ