* అమరావతి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయసభలు ప్రారంభం.. గవర్నర్ ప్రసంగం తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశం..
* ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కఠినతరం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లకు ప్రత్యేక పాస్‌లు
* అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్.. పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి జగన్.. తాడేపల్లి క్యాంపు ఆఫీసుకు రావాలని ఎమ్మెల్యేలుకు వైసీపీ అధిష్టానం ఆదేశాలు..
* నేడు నేరుగా అసెంబ్లీకి రానున్న టీడీపీ ఎమ్మె్ల్యేలు.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమం రద్దు..
* హైదరాబాద్: నేడు నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం..
* తిరుమల: నేడు ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయనున్న టీటీడీ
* శ్రీశైలంలో నేడు ఆరోరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఉదయం శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. సాయంత్రం పుష్పపల్లకిలో ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్న ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో పుష్పపల్లకిలో గ్రామోత్సవంగా వివారింపు
* నేడు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏపీ గవర్నర్.. స్వామి, అమ్మవార్లను దర్శించుకోనున్న గవర్నర్
* కాకినాడ: నేడు అన్నవరం ఆలయ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.. ఐవీఆర్ఎస్ సర్వేలో అన్నవరం దేవస్థానానికి ఆఖరి స్థానం రావడం పై రివ్యూ.. కొండపై దళారుల వ్యవస్థ భక్తుల అసౌకర్యాలపై చర్చించనున్న కలెక్టర్
* అన్నమయ్య జిల్లా : రాయచోటిలో 2వ రోజుకు చేరుకున్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు… ఉదయం 9 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు కళ్యాణ మహోత్సవం, సాయంత్రం 6 గంటలకు సుమంగళి పూజ..
* కాకినాడ: నేడు కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేయనున్న తుని మున్సిపాలిటీలో వైసిపి కౌన్సిలర్లు.. వైసీపీలో మిగిలిన 17 మందిని రాజీనామా చేయమని ఆదేశించిన దాడిశెట్టి రాజా
* తిరుపతి: వైభవంగా కాళహస్తి లో శివరాత్రి బ్రహ్మోత్సవాలు… ఉత్సవాలలో భాగంగా ఉదయం హంస వాహనం, రాత్రి నెమలివాహనసేనలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామీ, అమ్మవార్లు
* విజయవాడ : వల్లభనేని వంశీ పిటిషన్లపై నేడు తీర్పు ఇవ్వనున్న ఎస్సీ ఎస్టీ కోర్టు.. వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లు మీద తీర్పు ఇవ్వనున్న న్యాయమూర్తి
* అనంతపురం : తాడిపత్రి లోని శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నరమృగ వాహనం.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ప్రతి సోమవారం నిర్వహించే. పీజీఆర్ఎస్ రద్దు.. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీజీఆర్ఎస్ రద్దు
* అనంతపురం : నగరంలోని ఆర్ ఎఫ్ రోడ్డు వేంకటేశ్వరాలయంలో సత్సంగం సమితి ఆధ్వర్యంలో విష్ణుసహస్రనామ కోటి పారాయణం.
* అనంతపురం : తాడిపత్రి లోని శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నరమృగ వాహనం.
* శ్రీ సత్యసాయి : లేపాక్షిలో రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..
25న మహాగణపతి సుదర్శన హోమం, అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభం. 26న దీపోత్సవం, రుద్రాభిషేకం, కళ్యాణోత్సవం, 27న స్వామివారి బ్రహ్మరథోత్సవం 28న చండీహోమం, రాత్రికి ముత్యాలపల్లకి, మార్చి 1న వసంతోత్సవం, ధ్వజావరోహణ
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,892 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,930 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.55 కోట్లు
* నంద్యాల: మహానందిలో నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఉదయం.. అనుజ్ఞ గణపతి పూజ, పుణ్యాహవచనము, త్రిశూల చండీశ్వరార్చన, దీక్షాకంకణధారణ, ఋత్విక్వరణ.. మధ్యాహ్నం.. వాస్తు పర్యగ్నికరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, కలశస్థాపన, అఖండదీప ప్రతిష్ఠ, అగ్నిముఖం. రాత్రికి భేరి పూజ, దిగ్దేవతాహ్వానం. దృజపూజ, ధ్వజారోహణం, మయూర వాహన సేవ
* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు పార్వతీపురం పట్టణంలో పశువర్ధ శాఖ ఆధ్వర్యంలో ఉచిత చికెన్, గుడ్లు పై మేళ
* ఆదిలాబాద్: ఇవాళ జిల్లా కేంద్రంలోని రామ్ లీలా మైదానంలో సేవా లాల్ జయంతి వేడుకలు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్.
* ఆదిలాబాద్: ఇవ్వాళ్టి ప్రజా వాణి రద్దు. ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ నేపథ్యం ప్రజావాణి రద్దు చేసినట్లు అధికారుల ప్రకటన.