* ఢిల్లీ: నేడు సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ
* తిరుమల: నేడు ఆన్‌లైన్‌లో నవంబర్ నెల దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేయనున్న టీటీడీ
* హైదరాబాద్: నేడు మహిళా కమిషన్ ముందు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకానున్న కేటీఆర్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నోటీసులు
* ప్రకాశం: మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల జిల్లా అద్దంకి, మార్టూరు మండలాలలో పాటు ప్రకాశం జిల్లా మండ్లమూరు మండలం మారెళ్ళ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు..
* బాపట్ల : చీరాల ఆర్టీసీ బస్టాండ్ లో నూతన బస్సు సర్వీసులను జెండా ఊపి ప్రారంభించనున్న ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య..
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 353 వ ఆరాధనోత్సవాలు నేటితో ముగింపు.. నేడు మూలబృందావనంకు తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి విశేష పూజలు… రాత్రి ప్రహ్లదరాయులను పంచ రథంపై ఉరేగింపు.
* ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొలుసు పార్థసారథి.. చింతలపూడి నుంచి నామవరం వరకు 20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేయనున్న మంత్రి..
* విశాఖ: నేడు అచ్యుతాపురం SEZ లో వామపక్ష పార్టీల రాష్ర్ట నాయకత్వం పర్యటన.. ప్రమాదం జరిగిన తీరు, బాధితులకు అందుతున్న వైద్యసేవలు పరిశీలించనున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
రామకృష్ణ
* తూర్పుగోదావరి జిల్లా : ఉదయం 9:30కి రాజమండ్రి ట్రైనింగ్ కాలేజ్‌లో సభ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కందుల దుర్గేష్.. ఉదయం 11:30 గంటలకు ఆలమూరు మండలం, మడికి హైవే నందు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:00 గంటలకు విజయవాడకు పయణం.
* విశాఖ పార్లమెంటు స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్న బీజేపీ.. హాజరుకానున్న సోము వీర్రాజు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
* అనంతపురం : ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు.
* కర్నూలు: సుంకేసుల జలాశయంకు కొనసాగుతున్న వరద … ఇన్ ఫ్లో 27,120 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 24,675 క్యూసెక్కులు, 6 గేట్ల ఎత్తివేత.. కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కుల నీటి విడుదల
* కర్నూలు.: నేడు హాలహర్వి మండలం చత్రగుడి శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవం..
* శ్రీ సత్యసాయి : పెనుకొండలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత…
* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. ఇన్ ఫ్లో 1,04,365 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 69,105 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* గుంటూరు: నేడు వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ , స్నాతకోత్సవం… హాజరుకానున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. నరసింహ..
* గుంటూరు: నేడు వడ్లమూడి డివిసి హాస్పిటల్ లో , కార్దియాక్ విభాగాన్ని ప్రారంభించనున్న, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ …
* పల్నాడు: నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ,ఎస్టీల సమస్యల పరిష్కార వేదిక …
* కడప జిల్లా: మూడవ శ్రావణ శనివారం కావడంతో గండి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు.. తెల్లవారుజామున నుండే ఆంజనేయ స్వామి దర్శించుకోవడానికి క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు…
