NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* దావోస్‌లో నాలుగో రోజు సీఎం చంద్రబాబు బృందం పర్యటన.. నేడు మరికొన్ని ముఖ్య సంస్థల ప్రతినిధులతో సమావేశం.. ఇవాళ రాత్రికి సీఎం చంద్రబాబు దావోస్ నుంచి ఢిల్లీకి వెళ్లే అవకాశం..

* తెలంగాణలో మూడో రోజు కొనసాగుతున్న గ్రామ సభలు.. నిన్నటి వరకు 9,844 గ్రామాలలో విజయవంతంగా గ్రామ సభల నిర్వహణ.. బుధవారం జరిగిన గ్రామసభలు- 3888.. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు 10 లక్షల 9 వేల 131 దరఖాస్తులు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం వచ్చిన దరఖాస్తులు 59,882

* హైదరాబాద్‌: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ ముందుకు ఏజెన్సీ సంస్థలు.. మూడు రోజుల పాటు మూడు ఏజెన్సీ సంస్థలను విచారించనున్న కాళేశ్వరం కమిషన్.. కమిషన్ ముందుకు మేడిగడ్డ నిర్మించిన ఎల్ అండ్ టీ, అన్నారం నిర్మించిన ఆప్కాన్స్, సుందిళ్ళ నిర్మించిన నవయుగ సంస్థలు.. ఈ రోజు నవయుగ, రేపు ఎల్ అండ్‌ టీ, ఎల్లుండి అఫ్కాన్స్ ఏజెన్సీ సంస్థలు

* ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కందుకూరు లోని టిడిపి కార్యాలయంలో జరిగే మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు.. అనంతరం కొండపి నియోజకవర్గంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

* ప్రకాశం : ఒంగోలులో విద్యా రంగంలో తీసుకురానున్న సంస్కరణలపై ప్రకాశం, నెల్లూరు జిల్లాల విద్యా శాఖ అధికారులతో సమావేశం, హాజరుకానున్న రెండు జిల్లాల కలెక్టర్లు తమీమ్ అన్సారియా, ఓ. ఆనంద్, విద్యా శాఖ ప్రతినిధులు..

* ప్రకాశం : కనిగిరిలో సీపీఎం ఆధ్వర్యంలో వెలిగొండ ప్రాజెక్ట్ సాధన సదస్సు, హాజరుకానున్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు..

* తిరుమల: ఇవాళ సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో టోకెన్లు జారీ ప్రక్రియ ప్రారంభించిన టీటీడీ

* తిరుమల: ఇవాళ ఆన్‌లైన్‌లో ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకేన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శనం టిక్కెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

* గుంటూరు: మిర్చి యార్డ్ లో నేటి నుండి రైతులకు ఉచిత భోజన సదుపాయం… మిర్చి యార్డుకు చేరుతున్న కొత్త మిర్చి పంట .. బుధవారం 90,138 టిక్కిల మిర్చి, యార్డుకు చేరినట్లు చెబుతున్న అధికారులు…

* తిరుపతి: నేడు ఎస్వీయూ వర్శిటి గ్రౌండ్ లో పదివేలమందితో సామూహిక సూర్య నమస్కారాలు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్, వివేకానంద జయంతి ఉత్సవాల ముగింపు పరాక్రమ్ దివస్ సందర్భంగా శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, వివేకానంద కేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో సామూహిక సూర్య న మస్కారం కార్యక్రమం

* గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు, దాఖలవుతున్న నామినేషన్లు … రేపు సాయంత్రం వరకు, నామినేషన్ల దాఖలకు గడువు.. ఫిబ్రవరి 3న జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నిక…

* మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన. ఆందోల్ నియోజకవర్గంలో ప్రజా పాలన గ్రామ సభలో పాల్గొననున్న మంత్రి దామోదర

* నేడు మెదక్ జిల్లాలో డీజీపీ జితేందర్ పర్యటన.. ఎస్పీ కార్యాలయంలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి హాజరుకానున్న డీజీపీ

* నేడు ఖమ్మం జిల్లా లో మంత్రి పొంగులేటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు

* ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా లో కనిష్ట ఉష్ణోగ్రతలు.. కొమురం భీం జిల్లా సిర్పూర్ (యు)లో 10 గా నమోదు. ఆదిలాబాద్ జిల్లా అర్లీ టీ లో 11.2 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. నిర్మల్ జిల్లా లో వానల్ పహాడ్ 12.2గా నమోదు . మంచిర్యాల జిల్లా జన్నారం లో 14.2గా ఉష్ణోగ్రతలు నమోదు.

* తిరుమల: 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,223 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,704 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.1 కోట్లు