NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఏపీ: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు.. ఉపాధి హామీ పథకం కింద పనులు ఖరారు చేయనున్న గ్రామసభలు.. ఒక రాష్ట్రంలో ఒకే రోజు గ్రామసభల నిర్వహణతో రికార్డ్ సృష్టించనున్న ఏపీ.. రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు.. దేశంలోనే మొదటిసారి భారీ స్థాయిలో ఒకే రోజు గ్రామ సభల నిర్వహణ.

* ఢిల్లీ: ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొననున్న సోనియా, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షీ, కేసీ వేణుగోపాల్.. పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై తుది నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. కొత్తపేట నియోజకవర్గం వానపల్లి గ్రామంలో జరిగే గ్రామసభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

* తిరుమల: ఇవాళ నవంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టికెట్లు విడుదల.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు.. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు.. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

* నేడు అన్నమయ్య జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పర్యటన.. రైల్వే కోడూరులోని మైసూరావారిపల్లెలో గ్రామసభలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం.. రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామంలో అన్నమయ్య డ్యాం తెగి వరదలకు దెబ్బతిన్న గ్రామాలను పరిశీలించనున్న పవన్‌ కల్యాణ్‌

* నేడు అనకాపల్లి జిల్లాలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.. ఫార్మా ప్రమాదంలో గాయపడి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్న జగన్

* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించనున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి..

* ప్రకాశం: సీఎస్ పురంలో జరిగే గ్రామసభలో పాల్గొననున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి..

* ప్రకాశం : గిద్దలూరులో అభివృద్ది కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొననున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి..

* పశ్చిమ గోదావరి: ఉదయం 10:30 కు పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ లో మాజీ ముఖ్య మంత్రి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించనున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. ఉదయం 11 గంటలకు పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగే NRGS గ్రామసభలో పాల్గొననున్న మంత్రి.

* తూర్పు గోదావరి జిల్లా: ఉదయం 8 గంటలకు టూరిజం అధికారులతో టూరిజం ప్రాజెక్ట్ మీటింగ్ లో పాల్గొనున్న మంత్రి కందుల దుర్గేష్.. 9 గంటలకు రాజమండ్రి కోరుకొండ రోడ్ లో మార్కెట్ యార్డ్ ఎదురుగా ఆర్కే టీవీ వారి ఏపీ ఫైబర్ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే నిర్వహించబడిన గ్రామసభ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రంకలెక్టరేట్‌లో పేపర్ మిల్స్ అసోసియేషన్ యాజమాన్యంతో మీటింగ్‌లో పాల్గొంటారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ నందు ధర్మంచార కమ్యూనిటీ హాల్లో నిఘంటువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

* ఏలూరు జిల్లా వ్యాప్తంగా నేడు 547 గ్రామ పంచాయితీల్లో గ్రామ సభలు..

* అనంతపురం : జిల్లాలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.

* శ్రీ సత్యసాయి : కనగానిపల్లి మండలంలోని భానుకోటలో కొల్లాపురమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం.

* అనంతపురం : నేటి నుంచి మూడు రోజుల పాటు సెలవులో వెళ్లనున్న జిల్లా కలెక్టర్ . తిరిగి 26న విధులకు హాజరుకానున్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్.. ఇంచార్జి కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ బాధ్యతలు.

* అనంతపురం : గుంతకల్ పట్టణంలో రైల్వే ప్రాంతంలోకి ప్రవేశించకుండా రహదారిపై నిర్మించిన ప్రహరీ గోడను తొలగించని డిమాండ్ చేస్తూ DRM కార్యక్రమం ఎదుట సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.

* నేడు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలో గ్రామసభ.. హాజరుకానున్న మంత్రి నాదెండ్ల మనోహర్…

* నేడు గుంటూరు లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో, మెగా జాబ్ మేళా…

* గుంటూరు: రేపు విజ్ఞాన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం… హాజరుకానున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. నరసింహ..