NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేటి నుంచి రష్యాలో బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు

* నేడు ప్రధాని మోడీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ.. భారత్-రష్యా దౌత్య సంబంధాలపై చర్చ

* నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో తెలంగాణ మంత్రులు , అధికారుల బృందం పర్యటన.. హాన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ను సందర్శించనున్న బృందం.. సియోల్ నగరంలో నీటి సరఫరా, పర్యావరణం మరియు ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న హాన్ నది.. కాలుష్యానికి గురైన హాన్ నదిని శుభ్రపరచి, పునరుద్ధరించిన దక్షిణ కొరియా ప్రభుత్వం.

* నేడు ఖమ్మంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై దిశ సమావేశం.. పాల్గొననున్న ఎంపీ రఘురామిరెడ్డి

* ప్రకాశం : ఒంగోలు పాత జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం, హాజరుకానున్న మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, అన్నీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు..

* ప్రకాశం : పీసీ పల్లి, పామూరు మండలాలలో జరగనున్న ప్రజాదర్బార్ కార్యక్రమలలో పాల్గొననున్న కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి..

* విజయవాడ: ఇవాళ అమరావతి డ్రెస్ న్ సమ్మిట్.. ముఖ్య అతిథులుగా హాజరుకానున్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. దేశానికే ఏపీని డ్రోన్ టెక్నాలజీ హబ్ గా తయారుచేయాలన్న ప్రభుత్వ లక్ష్యం.. 5500 డ్రోన్ లతో అతి పెద్ద డ్రోన్ షో.. సమ్మిట్ వద్ద 53 స్టాళ్లు.. ఆకాశంలో అద్భుతాలను ఆవిష్కరించనున్న డ్రోన్ షో

* అమరావతి: రాష్ట్రంలో సాగునీటి వినియోగదా రుల సంఘాలకు ఇవాళ నుంచి ఎన్నికలు.. గత ఐదేళ్లలో సాగునీటి సంఘాలకు జరగని ఎన్నికలు.. రాష్ట్రంలో 21,060 మేజర్, 3192 మీడియం, 24,768 మైనర్ మొత్తంగా 49,020 ప్రాదేశిక సంఘాలు, 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాలు..

* అమరావతి: ఇవాళ, రేపు పోలవరం నిర్మాణంపై సమీక్షలు.. అనంతరం సీ‌ఎం చంద్రబాబు సమక్షంలో నిర్మాణ సంస్ధలతో భేటీ..

* అమరావతి: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సీకే కన్వెన్షన్ లో డ్రోన్ సమ్మిట్.. సాయంత్రం 6 గంటల నుంచి పున్నమి ఘాట్ వద్ద డ్రోన్ షో.. ఇవాళ, రేపు రెండు రోజులపాటు డ్రోన్ సమ్మిట్

* సుంకేసుల జలాశయంకు కొనసాగుతున్న వరద ప్రవాహం.. ఇన్ ఫ్లో 44,520 క్యూసెక్కులు.. ఔట్‌ ఫ్లో 44,515 క్యూసెక్కులు.. 10 గేట్ల ఎత్తివేత..

* నంద్యాల : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. జలాశయం 4 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత.. ఇన్ ఫ్లో 1,60,146 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 1,77,040 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు విడుదల.. మధ్యహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల

* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 2 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,894 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,355 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు వాడపల్లి వెంకటటేశ్వర స్వామీ బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు అష్టదళ పాదపద్మారాధన, సరస్వతి అలంకరణలో హంస వాహనంపై శ్రీవారి వాహన సేవ

* ఢిల్లీ: బ్రిక్స్ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా పర్యటనకు బయల్దేరిన ప్రధాని.. రెండు రోజుల పాటు రష్యాలో పర్యటన.. 16 వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ