* నేడు భారత్ బంద్‌కు రిజర్వేషన్ బచావో సమితి పిలుపు.. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఉపసంహరించుకోవాలని డిమాండ్
* నేడు జమ్ము కశ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటన.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యనేతలతో భేటీకానున్న రాహుల్
* ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ ఛార్జీషీట్‌పై నేడు విచారణ జరపనున్న కోర్టు
* ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం.. మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు.. నిజామాబాద్, జగిత్యాల, భువనగిరి, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వర్షాలు.. ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
* హైదరాబాద్: నేడు బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ వర్క్‌షాప్.. బీజేపీ రాష్ట్ర ఆఫీస్‌లో జరిగే వర్క్‌షాప్‌కు హాజరుకానున్న పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ అభయ్ పాటిల్
* నేడు సంగారెడ్డి జిల్లాలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. సంగారెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్ తో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష
* ఖమ్మం జిల్లాలో నేడు ముగ్గురు మంత్రులు పర్యటన.. మధిరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర్ రావు.. పాలేరులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల పర్యటన..
* అమరావతి: నేడు రేపు, ఎల్లుండి పార్టీ నాయకులతో వైఎస్ జగన్ సమావేశాలు.. ఇతరులు కలిసేందుకు అవకాశం లేదని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడి
* రాష్ట్ర ప్రభుత్వ పురపాలక.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో నేడు మీడియా సమావేశం..
* తిరుమల: ఇవాళ తిరుమలకు మెగాస్టార్ చిరంజీవి.. రేపు తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్న చిరంజీవి
* తూర్పుగోదావరి: నేడు భారత్ బంద్ సందర్భంగా షాపులకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించిన రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్.. సెలవు ప్రకటించిన ప్రైవేట్ విద్యా సంస్థలు.. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్ కు పిలుపు.. బంద్ కు ప్రజలు మద్దతు తెలిపి సహకరించాలని కోరిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్
* తూర్పు గోదావరి జిల్లా: భారత్ బంద్ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన.. ఆర్టీసీ బస్సుల. రాకపోకలను అడ్డుకున్న ఆందోళనకారులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉదయం 11 గంటలకు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామికి నేడు మద్యరాధన.. నేడు స్వామివారి మూలబృందావనంకు తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి విషేశ పూజలు. స్వామి వారి పాదుకలను నవరత్న స్వర్ణ రథంపై ఉరేగింపు. సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న ప్రహ్లదరాయుడు.
* విశాఖ: భారత్ బంద్ కారణంగా నేడు ఆంధ్రా యూనివర్సిటీ సెలవు..
* బాపట్ల : మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు..
* అనంతపురం : భారత్ బంద్ నేపథ్యంలో ఎస్కే యూనివర్సిటీ లో జరగాల్సిన ఎంబీఏ, పీజీ పరీక్షలు వాయిదా. వాయిదా పడిన పరీక్షలు ఈ నెల 28న నిర్వహణ.
