NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు, రేపు పోలాండ్‌లో ప్రధాని మోడీ పర్యటన.. 45 ఏళ్ల తర్వాత తొలిసారి పోలాండ్‌లో పర్యటించబోతున్న భారత ప్రధాని.. భారత్‌లో పోలాండ్‌కు చెందిన సుమారు 30 కంపెనీల కార్యకలాపాలు.. పోలాండ్‌లో చదువుతున్న సుమారు 5 వేల మంది భారత విద్యార్థులు

* హైదరాబాద్‌లో భారీ వర్షం.. చాలా ప్రాంతాల్లో 10 సెంటీ మీటర్లు దాటిన వర్షపాతం.. యూసఫ్ గూడలో 12, రాజేంద్రనగర్ 11, వెస్ట్ మారేడ్ పల్లి 10, ఉప్పల్ 10, గోల్కొండ 10, పికెట్‌లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు.. ఉదయం 8 గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం

* హైదరాబాద్‌: నేడు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు సోమాజీగూడా వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించనున్న సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు.. ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు.

* ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ.. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ల ధర్మాసనం.. గత విచారణ సందర్భంగా కవిత పిటిషన్ పై ఈడీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు

* ప్రకాశం : గిద్దలూరులో జిల్లా సైనిక్ అధికారి ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన ఆర్మీ జవాన్ల కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమం..

* తిరుమల: ఎల్లుండి ఆన్ లైన్ లో నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాలో పాల్గొంటారు.

* అమరావతి: నేడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ .. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన వంశీ

* అమరావతి: మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు విచారణ.. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలులో అక్రమాలు చేశారని రాజీవ్ ను, మండల సర్వేయర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ

* గుంటూరు: మంగళగిరి నగరపాలక సంస్థ ఆర్థిక లావాదేవీల పై, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ .. గడిచిన ఐదు సంవత్సరాలుగా, ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టిన పనులు, జరిగిన ఖర్చులపై వివరణ అడిగిన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌..

* నేడు గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం… ఈనెల 17న జరిగిన కౌన్సిల్ సమావేశం.. సభ్యుల మధ్య సమన్వయం లేకపోవడం తో అజెండాలోని అంశాలు పూర్తి అవ్వకపోవడంతో, నేడు మరొకసారి సమావేశం కానున్న కౌన్సిల్ పాలకవర్గం….

* నేడు కాకినాడ జేఎన్టీయూ 16వ ఆవిర్భావ దినోత్సవం.. హాజరుకానున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ రామ్మోహన్ రావు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యణ్‌ ఓఎస్డీ కృష్ణమోహన్ కు యంగ్ అచీవర్ అవార్డ్ ప్రధానం

* తూర్పుగోదావరి జిల్లా: ఉదయం 8 గంటలకు రాజమండ్రి టూరిజం అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొనున్న మంత్రి కందుల దుర్గేష్‌.. 12 గంటలకు పెరవలి మండలం, కానూరు అగ్రహారంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. 2 గంటలకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వేమగిరి గ్రామంలో వేమగిరి గ్రామ దేవత ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 3 గంటల నుండి సాయంత్రం 6 వరకు కాకినాడ టూరిజం అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొంటారు.

* అమరావతి: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ .. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో వీవీ ప్యాట్లల్లో ఓట్లు సరిపోల్చా లని మాక్ పోలింగ్ వద్దని పిటిషన్ వేసిన బాలినేని.. నేడు వాదనలు వినిపించనున్న ఎన్నికల సంఘం

* కర్నూలు: మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి నేడు పూర్వరాధన… స్వామి వారి మూలబృందావనంకు తుంగ జలంతో అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి విషేశ పూజలు… ఆశ్వ వాహనంపై ప్రహ్లదరాయుడు ఉరేగింపు.

* నంద్యాల : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. ఇన్ ఫ్లో : 69,060 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో : 37,328 క్యూసెక్కులు.. కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి .. ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* శ్రీ సత్యసాయి : హిందూపురం ఛైర్ పర్సన్ ఇంద్రజ రాజీనామా ఆమోదానికి రంగం సిద్ధం . నేడు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం.రాజీనామాను ఆమోదించనున్న మిగిలిన సభ్యులు

* జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క) పర్యటన.. రేగొండ మండలంలోని శ్రీ కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల కొరకై కొడవటంచలో 12.కోట్ల 15 లక్షల తో ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన. శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి గుట్ట పరిసర ప్రాంతాలను, పాండవుల గుట్ట పరిసర ప్రాంతాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయుట కొరకు పరిశీలిస్తారు.. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు.. మేడారం అభివృద్ధి పనుల తీరు పరిశీలించి.. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు…

* సిద్దిపేటలో నేడు కాంగ్రెస్, BRS పోటా పోటీ సమావేశాలు.. నేడు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం.. సభకు హాజరుకానున్న మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. పల్లె పల్లెలో రైతుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో రుణమాఫీ అంశంపై BRS సమావేశం.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకులంతా హాజరుకావాలని పిలుపునిచ్చిన BRS

* ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటన పై విచారణ.. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు.. డాక్టర్ హత్యచార ఘటనపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు.. కొనసాగుతున్న సీబిఐ విచారణ

* తిరుమల: 22 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71595 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 28981 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు

Show comments