* జమ్ము కశ్మీర్‌లో చివరి దశ పోలింగ్.. జమ్ములో 24, కశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాల్లో పోలింగ్.. 415 మంది అభ్యర్ధుల భవితను తేల్చనున్న 39.18 లక్షల మంది ఓటర్లు.. మొత్తం 5,060 పోలీంగ్ కేంద్రాల్లో పోలింగ్
* కర్నూలు: నేడు పత్తికొండ మండలం పుచ్చకాయలమాడకు సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్ భరోసా ఫించన్ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు.. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్న సీఎం చంద్రబాబు.
* ఇవాళ తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాత్రికి కాలినడకన తిరుమల చేరుకోనున్న పవన్ కల్యాణ్.. నడక మార్గంలో మూడు అంచెల భద్రత ఏర్పాట్లు.
* అమరావతి: గిరిజనుల సమస్యలపై సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయం.. నేటి నుంచి గిరిజనుల సమస్యలపై ఇంటింటి సర్వే..
* తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్న సర్వదర్శనం.. వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళపాదపద్మారాదన సేవలు రద్దు.
* అమరావతి: నేడు పవన్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ.. గతంలో వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలకు గుంటూరు పోలీసుల కేసు.. కేసు క్వాష్ చేయాలని హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ పిటిషన్.
* హైదరాబాద్: నేటి నుంచి 10 వరకు డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెరిఫికేషన్.. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు 10 జిల్లాలకు 13 మంది ఉన్నతాధికారుల నియామకం.
* అమరావతి: ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ.. మాజీ ఎంపీ నందిగామ సురేష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ.. మైన్స్ కేసులో నిందితులుగా ఉన్న ప్రతిమ ఇన్‌ఫ్రా సీఈవో అనిల్ కుమార్ , వెంకటకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్స్‌పై విచారణ.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన అనుచరుల ముందస్తు బెయిల్ పిటిషన్స్‌పై విచారణ.. ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని, ఐవో సత్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్స్‌పై విచారణ
* తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.77,230.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.70,790.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,00,900.
* అమరావతి: ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో నేటి నుంచి పట్టభద్రుల ఓటు నమోదు.. ఓటు నమోదు కోసం ఫామ్ 18ను తహశీల్దార్ ఆఫీసులో ఇవ్వాలని సూచన