NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఢిల్లీ: నేడు కేంద్ర బడ్జెట్-2025.. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రసంగం.. వరుసగా 8వ సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్..

* నేడు ఏపీవ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పంపిణీ..

* నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రాయచోటి నియోజకవర్గం సంబేపల్లిలో పర్యటించి పెన్షన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు

* నేడు తెలంగాణ బీజేపీ జిల్లా అధ్యక్షుల నామినేషన్ల స్వీకరణ.. రేపు బీజేపీ జిల్లా అధ్యక్షుల ప్రకటన.. 11 జిల్లాలను పెండింగ్‌లో పెట్టిన పార్టీ అధిష్టానం

* నేడు శ్రీకాళహస్తి శివరాత్రి వేడుకలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష..

* నేడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి విదేశీ నిపుణులు.. డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో వాడుతున్న మెటీరియల్‌, మిషనరీ పరిశీలన.. ప్రాజెక్ట్ అథారిటీ, బావర్‌, మెగా సంస్థ, ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చ

* అమరావతి: నేటి నుంచి ఏపీలో అమల్లోకి రానున్న నూతన మార్కెట్ ధరలు.. రాష్ట్రంలోని 16997 గ్రామాల్లో, 9054 వార్డుల్లో ధరల పెంపునకు నిర్ణయం.. 68 గ్రామాల్లో లేని పెంపుదల

* అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ..

* ప్రకాశం : మద్దిపాడు మండలం మల్లవరం గుండ్లకమ్మ జలాశయంలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకం కింద చేప పిల్లలు విడుదల చేసే మీనోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు గొట్టిపాటి రవికుమార్ , డోల బాల వీరాంజనేయ స్వామి..

* బాపట్ల : జే పంగులూరు మండలం ముప్పవరంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్..

* ప్రకాశం : రాచర్ల మండలం యడవల్లిలో 6 కోట్ల రూపాయల నిధులతో లెదర్ పార్క్ లో రోడ్డు, ట్రైనింగ్ సెంటర్ భవనం, పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరుకానున్న మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, లిడ్ క్యాప్ చైర్మన్, పిల్లి మాణిక్యాల రావు, కలెక్టర్ తమీమ్ అన్సారియా..

* అల్లూరి జిల్లా: అరకు చలి ఉత్సవ్ లో రెండవ రోజు బొర్రా గృహాలు నుండి అరకు డిగ్రీ కళాశాల మైదానం వరకు సైక్లింగ్ ఈవెంట్ … సాయంత్రం ప్రధాన వేదిక దగ్గర లేజర్ షో, గిరిజన సాంప్రదాయ నృత్యాలు, పలు సినీ సాంస్కృతిక కార్యక్రమాలు

* విజయవాడ: కేంద్ర బడ్జెట్ పై నేడు CII కార్యవర్గం సమావేశం

* నేడు తిరుపతి లో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటన.. రేపు పుంగనూరు నియోజక వర్గంలో ‘జనంలోకి జనసేన’ బహిరంగ సభ

* విజయనగరం జిల్లా గజపతినగరం వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద నేడు కార్యకర్తలతో సమావేశం.. హాజరుకానున్న గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య…

* శ్రీ సత్యసాయి : పెనుకొండ మండలం వెంకటాపురం తాండాలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సవిత.

* అనంతపురం : విడపనకల్లు మఃడలంలో ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి పయ్యావుల కేశవ్.

* విజయనగరం: సాలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో “ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల” సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేడు సమావేశం..

* నంద్యాల: బనగానపల్లె (మం) నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో నేడు అమ్మవారికి సహస్ర నామ కుంకుమార్చన, మహా మంగళ హారతి, ప్రత్యేక పూజలు, చీరే సారే బోనాలు సమర్పించనున్న భక్తులు.

* కర్నూలు: నేటి నుండి పత్తికొండలో సౌత్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.. టోర్నమెంట్ ను ప్రారంభించనున్న శాప్ చైర్మన్ రవి నాయుడు, ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్

* భద్రాద్రి: నేటి నుంచి అయిదు రోజుల పాటు భద్రాచలం లో భక్త రామదాసు జయంతి ఉత్సవాలు.. వాగ్గేయ కారోత్సవాలు

* ఖమ్మం: నేలకొండపల్లి రామదాసు ధ్యాన మందిరం లో రామ దాసు జయంతి ఉత్సవాలు