NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* కేరళ: నేడు వయనాడ్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన.. వయనాడ్‌ ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న రాహుల్, ప్రియాంక

* హైదరాబాద్‌: నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ..

* రంగారెడ్డి జిల్లా : ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట వద్ద యంగ్​ ఇండియా స్కిల్​ యూనివర్సిటీకి భూమిపూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..

* హైదరాబాద్‌: ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు.. సభలో మూడు ప్రభుత్వ బిల్లులు.. న్యాయ శాఖకు చెందిన రెండు సవరణ బిల్లులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు.. ఇప్పటికే న్యాయ శాఖ బిల్లులు సభలో ప్రవేశ పెట్టిన సర్కార్.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు.. నేడు అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ.

* అమరావతి: ఇవాళ నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయం 9 గంటలకు రెండు జిల్లాల పర్యటనలకు బయలుదేరనున్న చంద్రబాబు. శ్రీశైలంలో భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దర్శనం చేసుకుని జలహారతిలో పాల్గొననున్న చంద్రబాబు. శ్రీశైలం జల విద్యుత్పత్తి కేంద్రాన్ని సందర్శించనున్న ఏపీ సీఎం. సుండిపెంట గ్రామంలో సాగు నీటి సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి.. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో చంద్రబాబు పర్యటన.

* ప్రకాశం : సింగరాయకొండ మండలం పాకలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి…

* ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం.. 2,91,419 మంది లబ్ధిదారులకు 123.92 కోట్ల రూపాయల నగదును విడుదల చేసిన ప్రభుత్వం.. ఉదయం 7 గంటల నుంచి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయనున్న సచివాలయ సిబ్బంది..

* శ్రీకాకుళం: నేడు పలాస గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుండి కాంప్లెక్స్ వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ.. విద్యార్థులపై జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాలు అరికట్టాలని మానహారం నివహించనున్న ఎఐఎస్ఎఫ్.

* ప్రకాశం : ఇవాళ్టి నుంచి చీమకుర్తిలో 3 సీయం ఉత్పత్తి చేసే గ్రానైట్ ఫ్యాక్టరీల సమ్మె.. నిలిచిపోనున్న ఉత్పత్తి..

* తిరుమల: ఇవాళ్లి నుంచి నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. నెల రోజులు పుష్కరిణి హారతిని రద్దు చేసిన టీటీడీ..

* శ్రీకాకుళం: నేడు ఎన్టీఆర్ భరోసా పించన్ పంపిణీ కార్యక్రమం.. జి సిగడాం మండలం నిద్దాం పంచాయితీలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు .

* నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ.. అనంతరం నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగే భవన నిర్మాణాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం పై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు

* నెల్లూరు రూరల్ పరిధిలోని ఆనం వెంకటరెడ్డి నగర్ లో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

* కాకినాడ: నేడు పిఠాపురంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఎమ్మెల్సీ హరి ప్రసాద్

* శ్రీ సత్యసాయి : మడకశిర నియోజకవర్గం గుండుమలలో చంద్రబాబు పర్యటన.. గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని చేపట్టనున్న ఏపీ సీఎం.. మధ్యాహ్నం 1:45కి గుండుమల ప్రభుత్వ పాలిటెక్నీకల్ కళాశాల హెలిపాడ్ చేరుకొనున్న సీఎం.. 2:20 గంటలకు గుండుమలలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్దిదారులకు పంపిణీ.. మల్బరి ప్లాంటేషన్ షెడ్ ను సందర్శించి పట్టు రైతులతో ముఖాముఖీ.. 3:20కి గుండుమలలో కరియమ్మ దేవి దేవాలయన్ని సందర్శన. 3:25 నుంచి 4:25 దాక గ్రామ ప్రజలతో ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖా ముఖి

* శ్రీ సత్యసాయి : ధర్మవరంలో పర్యటించనున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం, ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.

* అనంతపురం : కూడేరు మండలం అంతరగంగ గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ .

* నేడు సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన.. భ్రమరాంభ మల్లికార్జునస్వాముల వారిని దర్శించుకోనున్న చంద్రబాబు.. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి జలహారతి ఇవ్వనున్న సీఎం.. నీటిపారుదల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష.. సున్నిపెంటలో ప్రజావేదికలో స్థానికులతో మాట్లాడనున్న చంద్రబాబు

* విజయనగరం: ఎన్టీఆర్ భరోసా పించన్ల ఇంటివద్ద నే పంపిణీ కి సర్వం సిద్ధం.. తొలి రోజే శత శాతం పంపిణీ కి ఏర్పాట్లు.. జిల్లా వ్యాప్తంగా 2,80,352 మంది లబ్దిదారులకు 116.67 కోట్ల పంపిణీ.

* పార్వతీపురం పట్టణంలో మొదలైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం.. పాల్గొన్న సచివాలయం సిబ్బందితోపాటు టిడిపి నాయకులు

* తూర్పుగోదావరి జిల్లా: ఉదయం 5:30 గంటలకు నిడదవోలు రూరల్ మండలం, పురుషోత్తపల్లి గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్‌.. ఉదయం 6 గంటలకు పెరవలి మండలం, కానూరు గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. 7కి ఉండ్రాజవరం మండలం, తాడిపర్రు గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.. 8కి నిడదవోలు పట్టణ ఎన్టీఆర్ కాలనీ నందు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. 10 గంటలకు రాజమండ్రి J.K గార్డెన్స్ నందు పాన్ ఇండియా జువెల్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న శాసనసభ్యులు…

* గుంటూరు: నేడు వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరంలో, సంఘం శరణం గచ్చామి పేరుతో , అంబేద్కర్ జీవిత చరిత్రపై నాటక ప్రదర్శన…

* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేడు స్వామి వారి మూలబృందావనంకు తుంగ జలంతో అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు.. మధ్యాహ్నం స్వామి వారి మూలబృందావనంకు వివిధ రకాల పూలతో అలంకరణ.. సాయంత్రం స్వామివారికి ఉంజలసేవ, బంగారు పల్లకి, గజ వాహనం, నవరత్న స్వర్ణ రథంపై ఉరేగింపు.

* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. జలాశయం 10 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల.. ఇన్ ఫ్లో 3,42,026 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 3,78,172 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులు.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* తిరుమల: 10 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,916 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,010 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు

* తూర్పు గోదావరి జిల్లా: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద క్రమేపి తగ్గుతున్న గోదావరి వరద ప్రవాహం.. బ్యారేజ్ వద్ద 12.30 అడుగులకు తగ్గిన నీటిమట్టం.. 10 లక్షల 50వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల.. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక