NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఏపీ: నేడు నెల్లూరు జిల్లాలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటన.. ఉదయం 10 గంటలకు నెల్లూరు ఉప రాష్ట్రపతి.. వెంకటాచలంలోని అక్షర విద్యాలయం సందర్శన.. అనంతరం స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ 23వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు.

* నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్‌.. కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు నిరసనగా ఐఎంఏ నిర్ణయం

* ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. నేడు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ.. సాయంత్రం 4.30కి ప్రధానితో.. సాయంత్రం 6 గంటలకు నిర్మలా సీతారామన్‌, రాత్రి 7 గంటలకు అమిత్‌షాతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు..

* ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా గతంలో కోరం లేక వాయిదా పడ్డ 99 పాఠశాల విద్యా కమిటీలకు ఇవాళ ఎన్నిక..

* ప్రకాశం: చీమకుర్తి లో కలకత్తా ఘటనకు నిరసనగా పౌర సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..

* బాపట్ల : చీరాలలో కలకత్తా ఘటనకు నిరసనగా ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..

* నేడు గుంటూరు కార్పొరేషన్ లో , మున్సిపల్ కౌన్సిల్ సమావేశం…

* ఏలూరు: కోల్ కతాలో విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్ పై అత్యాచార ఘటనకు నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1350 ఆసుపత్రుల్లో నిలిచిపోనున్న వైద్య సేవలు.. రేపు ఉదయం 6 గంటల వరకు నిలిచిపోనున్న వైద్య సేవలు.. అత్యవసర వైద్య సేవలకు మాత్రమే అందుబాటులో ఉండనున్న డాక్టర్లు..

* విశాఖ: నేడు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. పీ. సిసోడియా పర్యటన… ఫ్రీ హోల్డ్ భూములు, 22(ఏ) పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ.. భీమిలి నియోజకవర్గంలో పర్యటించి క్షేత్రస్థాయిలో వివరాలు సెకరించనున్న సిసోడియా

* అనంతపురం : కలకత్తాలో డ్యూటీలో ఉన్న డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి అశోక్ ఫిల్లర్ సర్కిల్ వరకు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన ర్యాలీ చేయనున్న డాక్టర్ లు.

*కడప: నేడు జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయనున్న డాక్టర్లు.. కోల్ కత్తా లో వైద్యురాలి పై అత్యాచారం, హత్య కు నిరసనగా 24 గంటలు నిరసనకు పిలిపునిచ్చిన ఇండియన్ మెడికల్ అసోషియేషన్. అత్యవసర కేసులు మినహా మిగిలిన అన్ని సేవలు బంద్.

* తిరుపతి : కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎం ఆర్ పల్లె నుండి పద్మావతి పురం సర్కిల్ వరకు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన ర్యాలీ చేయనున్న డాక్టర్ లు.

* అనంతపురం : నగరంలోని రెండవ రోడ్డులోని మంత్రాలయ రాఘవేంద్రస్వామి 353వ ఆరాధన ఉత్సవాలు.

* తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు.. రేపు శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం రద్దు చేసిన టీటీడీ

* శ్రీ సత్యసాయి : చెన్నేకొత్తపల్లి మండలం చిన్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సీతారాముల విగ్రహా ప్రతిష్ట,కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు..

* అనంతపురం : ఇవాళ జిల్లాలో పర్యటించనున్న ఎస్పీడీసీఎల్ సీఎండీ. విద్యుత్తు అధికారులతో సమీక్షా సమావేశం.

* తూర్పుగోదావరి జిల్లా: ఉదయం 10 గంటలకు పిడింగొయ్యి లా కాలేజ్ నందు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో.. 10:30కి రాజమండ్రి సంహిత డిగ్రీ కాలేజ్ నందు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కార్యక్రమంలో.. 11:30కి నిడదవోలులో V.R ఫ్యాషన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్‌.

* కర్నూలు: నేడు కోడుమూరు మండలం లద్దగిరి జడ్పీ స్కూల్ లో విద్యాకమిటీ చైర్మన్ ఎన్నిక.. టిడిపి లోని కోట్ల, విష్ణు వర్గం పోటీ పడటంతో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుపనున్న అధికారులు

* ఏలూరు జిల్లా: నేటి నుండి ఈనెల 20 వరకు ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో పవిత్రోత్సవాలు.. ఆలయంలో స్వామి వారికి జరిగే నిత్య కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు

* అనకాపల్లి జిల్లా: నేడు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు… 1476పాఠశాలల్లో జరగనున్న యాజమాన్య కమిటీ నియామకం కోసం ఎలక్షన్

* తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,625 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 34,462 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు

Show comments