NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* అమరావతి: నేడు ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

* ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు.. నిర్మలాసీతారామన్‌, జైశంకర్‌ను కలిసి సీఎం చంద్రబాబు.. నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం..

* నేడు మహారాష్ట్రకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న పవన్‌.. నేడు నాందేడ్‌ జిల్లా డెగ్లూర్‌, భోకర్‌, లాతుర్‌ బహిరంగ సభలు.. షోలాపూర్‌లో రోడ్‌షోలో పాల్గొననున్న పవన్.. రేపు చంద్రపూర్‌ జిల్లాలో బల్లాపూర్‌లో బహిరంగ సభ.. పూణె కంటోన్మెంట్‌లో రోడ్‌షో.. కస్బాపేట్‌ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొననున్న పవన్‌ కల్యాణ్

* నేడు, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి.. చంద్రాపూర్​ లో ప్రచారం.. రాజురా, డిగ్రాస్, వార్దా​ నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొని రాత్రికి తిరిగి నాగ్​పూర్ చేరుకోనున్న సీఎం.. ఆదివారం ఉదయం నాగ్​పూర్​ నుంచి నాందేడ్‌కు చేరుకుంటారు. నయగావ్, భోకర్​​, షోలాపూర్​ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న తెలంగాణ సీఎం..

* హైదరాబాద్‌: నేడు బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం.. మూసీ ప్రక్షాళన చేయండి-కానీ పేదల ఇళ్లు కూల్చకండి అనే నినాదంతో బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం.. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు కార్యక్రమం

* ప్రకాశం : ఒంగోలులో విద్యుత్ ట్రూఅప్ చార్జీలను రద్దు చేయాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం..

* రేపు తిరుమలలో కార్తీక వనభోజనం.. పార్వేట మండపానికి గజవాహనం పై ఊరేగింపుగా చేరుకోనున్న మలయప్పస్వామి.. పార్వేటమండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం.. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టిటిడి

* తిరుమల: ఎల్లుండి టిటిడి పాలకమండలి సమావేశం..

* విశాఖలో నేడు ఐటి శాఖ మంత్రి నారాలోకేష్ పర్యటన.. సాయంత్రం నగరానికి చేరుకోనున్న మంత్రి

* రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విజయవాడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పెంచలకోన.. అనంతసాగరం మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేటి నుండి గోదావరిలో 12 ఇసుక ర్యాంపులను ప్రారంభించడానికి చర్యలు.. ఈ మేరకు అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్…

* అనంతపురం : పామిడి- కల్లూరు మధ్య జరుగుతున్న రైల్వే ట్రాక్ పనుల కారణంగా నేటి నుంచి ఈ నెల 18 వరకు ఈ మార్గం గుండ వాహనాల రాకపోకలు నిలిపివేత, మరో మార్గం ద్వారా దారి ముళ్లింపు.

* అనంతపురం : నగరంలో లలితకళాపరిషత్తులో మాదిగల ఆత్మీయ సదస్సు.. హాజరు కానున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ.

* ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీలో దారుణం.. మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. చిన్నపిల్లల వార్డులో చెలరేగిన మంటలు.. 10 మంది శిశువులు సజీవ దహనం.. మరో 37 మంది శిశువులను కాపాడిన సిబ్బంది.. 16 మంది శిశువుల పరిస్థితి విషమం

Show comments