NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఏపీలో నేడు ఉదయం 7.30 గంటలకు 99 అన్న క్యాంటీన్లు ప్రారంభం.. కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రజా ప్రతినిధులు

* రాజన్నసిరిసిల్ల జిల్లా: శ్రావణ వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు.. అనుబంధాలయమైన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి ఓడి బియ్యం సమర్పిస్తున్న మహిళలు.. రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ..

* ప్రకాశం : ఒంగోలులో అన్న క్యాంటీన్ లను ప్రారంభించనున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్..

* ప్రకాశం: చీమకుర్తిలో అన్న క్యాంటీన్ లను ప్రారంభించనున్న కలెక్టర్ తమీమా అన్సారియా, ఎంఎల్ఏ విజయకుమార్..

* బాపట్ల : చీరాలలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించనున్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య..

* నెల్లూరు : కందుకూరులో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు..

* బాపట్ల : అద్దంకిలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్..

* తిరుమల: శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలలో రోండోవ రోజు.. రేపటితో ముగియనున్న పవిత్రోత్సవాలు.. ఇవాళ,రేపు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

* నెల్లూరు జిల్లా: శ్రీహరికోటలో SSLV D-3 రాకెట్ ప్రయోగానికి కొనసాగుతున్న కౌంట్ డౌన్.. ఆరున్నర గంటల పాటు కొనసాగనున్న కౌంట్ డౌన్.. ఉదయం 9.17 గంటలకు ప్రయోగం.. ప్రయోగ ప్రక్రియను శాస్త్రవేత్త లతో కలిసి పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్

* నెల్లూరు నగరంలో అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రులు పొంగూరు నారాయణ.. ఆనం రామనారాయణ రెడ్డి

* నేడు నెల్లూరుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో దివ్యాంగులకు ఉపకరణాలను అందచేయనున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

* కాకినాడ: నేడు జిల్లాలో ఎనిమిది చోట్ల అన్న క్యాంటీన్ లు పునః ప్రారంభం.. కాకినాడలో ఐదు, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలలో ఒక క్యాంటిన్ చొప్పున ప్రారంభం

* అనంతపురం : గుత్తి పట్టణంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం.

* అనంతపురం : తాడిపత్రి పట్టణంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, గాయత్రి దేవి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం.

* పశ్చిమ గోదావరి: పాలకొల్లులో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. సాయంత్రం 5 గంటలకి అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారు..

* తూర్పుగోదావరి జిల్లా: ఉదయం 8:30 గంటలకు నిడదవోలు పట్టణం నందు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్..

* శ్రీ సత్యసాయి : హిందూపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ లో అన్న క్యాంటీన్ పునః ప్రారంభం.. అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్డ్

* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా, అన్న క్యాంటీన్ ల ప్రారంభోత్సవాలు.. ఉదయం 7 గంటల నుండి ప్రారంభంకానున్న, అన్న క్యాంటీన్‌లు.. తాడేపల్లిలో రెండు అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్న మంత్రి నారా లోకేష్ ..తెనాలిలో 3 అన్న క్యాంటీన్ లను ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్.. నియోజకవర్గాల్లో, అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నస్థానిక ఎమ్మెల్యేలు.

* విజయనగరం నగర పాలక సంస్థలో ఉదయం 7:30 గం.లకు అన్న క్యాంటీన్లను పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్..

* తిరుపతి: నేడు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం.. సాయంత్రం అమ్మవారికి స్వర్ణ రథోత్సవం

* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతం..

* నేడు శ్రీశైలంలో 1500 మంది మహిళలతో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం.. వరలక్ష్మి వ్రతానికి మహిళలకు పూజ సామగ్రి ఉచితంగా అందజేయనున్న దేవస్థానం.. వరలక్ష్మి వ్రతం అనంతరం మహిళలకు శ్రీస్వామి అమ్మవారి దర్శనం కల్పించనున్న దేవస్థానం

* విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేడు నామినేషన్ల ఉప సంహరణ.. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవ ఎన్నిక.. ఇప్పటికే నామినేషన్ ఉపసంహరణ పత్రం అందజేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి షఫీ.. ఇవాళ బొత్స ఎన్నికను అధికారంగా ప్రకటించనున్న ఎన్నికల అధికారులు

* విశాఖ: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)లో ఎన్నికల కోలాహలం.. నేడు వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు.. పాలకవర్గ సభ్యుల రాజీనామాల కారణంగా ఖాళీ ఏర్పడిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ట్రెజరర్, కౌన్సిలర్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించనున్న ACA… పాలకవర్గంలో ప్రస్తుతం ఖాళీ ఏర్పడిన ఆరు స్థానాలకు జరగనున్న పోటీ ..

* విశాఖ: ఏపీ మారిటైమ్ బోర్డు CEO రెండు రోజులు పర్యటన… నేడు భోగాపురం ఎయిర్ పోర్టు అధికారులతో సమావేశం, పనులు పరిశీలన… రేపు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ను సందర్శించనున్న CEO

* విశాఖ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి మూడు రోజుల పర్యటన.. నేడు BR అంబేద్కర్ లా కాలేజ్ విద్యార్థులతో ముఖాముఖి….