NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేటి నుంచి పాకిస్థాన్‌లో SCO సదస్సు, ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. భారీ ప్రదర్శనకు సిద్ధమవుతోన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ

* మణిపూర్‌లో హింసపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం.. తొలిసారిగా మైతీ-కుకి, నాగా నేతలతో చర్చలు జరపనున్న కేంద్ర హోంశాఖ..

* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొలిక్కిరానున్న సీట్ల పంపకాలు.. నేడు శివసేన షిండే వర్గం.. ఎన్సీపీ అజిత్‌ పవర్ మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు

* విజయనగరంలో నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. భారీగా చేరుకుంటున్న భక్తులు..

* ఖమ్మం: నేడు ఖమ్మం జిల్లాల్లో మంత్రి తుమ్మల పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు

* ప్రకాశం : అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు.. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్నీ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు..

* ప్రకాశం : ఒంగోలు ఐఎంఏ ఆధ్వర్యంలో బెంగాల్ లో జూనియర్ డాక్టర్ల దీక్షకు మద్దతుగా సంఘీభావ దీక్ష..

* ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి జిల్లాలో అందుబాటులో ఉంటారు.. తుఫాను ప్రభావ ప్రాంతాలను పరిశీలించే అవకాశం..

* బాపట్ల : కొరిసపాడు మండలం పమిడిపాడులో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొననున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ.. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి లు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు.. ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో అన్ని విద్యాసంస్థలకూ సెలవు ప్రకటించిన కలెక్టర్

* అమరావతి: నేడు ఏపీ హైకోర్టులో ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద విచారణ.. ముంబై సినీ నటి జిత్వానీ ఫిర్యాదుపై ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ, ఏసిపి హనుమంత రావు, సీఐ సత్యనారాయణ పై కేసు నమోదు.. అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద నేడు విచారణ చేయనున్న హైకోర్టు

* అనంతపురం : జిల్లాలో సాగు, తాగు నీరు సమస్యలప్తె సీపీఎం బస్సు యాత్ర. నేటి నుంచి 20 వరకు కొనసాగునున్న యాత్ర.

* అనంతపురం : విజయవాడ పర్యటనలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.

* కర్నూలు: నేడు దేవరగట్టు లో శ్రీ మాల మల్లేశ్వర స్వామి గొలుసు త్రెంపుట, కోలాటాలు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు పల్లె పండగ వారోత్సవాల్లో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్‌.. మధ్యాహ్నం 2 గంటలకు నిడదవోలు రూరల్ మండలం, విజ్జేశ్వరం గ్రామం.. 2:30కి గోపవరం గ్రామంలో గవర్నమెంట్ పాఠశాల ప్రారంభోత్సవం. 3 గంటలకు కలవచర్ల గ్రామం.. 3:30కి జీడిగుంట గ్రామం.. 4 గంటలకు కోరుపల్లి గ్రామం.. 4:30 గంటలకు పెండ్యాల గ్రామం.. 5 గంటలకు మునిపల్లి గ్రామంలో… 5:30కి ఉండ్రాజవరం మండలం, వెలివెన్ను.. 6 గంటలకు శెట్టిపేట గ్రామం.. 6:30కి తాళ్లపాలెం గ్రామంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి.

* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనం రద్దు.. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టిటిడి

* తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,361 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 28,850 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.91 కోట్లు