* ఢిల్లీ: ఎర్రకోట పై కాసేపట్లో ప్రారంభం కానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. జవహర్ లాల్ నెహ్రు తర్వాత 11 వ సారి ఎర్రకోట పై జెండా ఎగురవేయనున్న మోడీ..
* స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్.. భారీగా మోహరించిన పోలీసులు, భద్రతా సిబ్బంది.. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో యాంటీ డ్రోన్, యాంటీ ఫ్లయింగ్ సిస్టం ఏర్పాటు..
* అమరావతి: ఇవాళ పంద్రాగస్టు వేడుకలు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి స్వాతంత్ర దినోత్సవాల్లో జెండావిష్కరణ చేయనున్న చంద్రబాబు.
* కాకినాడలో జెండావిష్కరణ చేయనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధికార హోదాలో తొలిసారి జెండా ఎగురవేయనున్న పవన్ కళ్యాణ్.
* అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పంద్రాగస్టు వేడుకల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగాలపై సర్వత్రా ఆసక్తి.
* ఇవాళ కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్న సీఎం. ఎన్టీఆర్ తొలిసారి ప్రాతినిధ్యం వహించిన గుడివాడలోనే అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం. పేదలతో కలిసి గుడివాడ అన్న క్యాంటీనులో భోజనం చేయనున్న చంద్రబాబు. తొవి విడతలో మొత్తంగా 17 జిల్లాల్లో అన్న క్యాంటీన్ల ప్రారంభం.
* నేడు కాకినాడ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
* ఒంగోలు పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించనున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి.. హాజరుకానున్న జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు..
* నెల్లూరులోని పోలీస్ పెరేడ్ మైదానంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించనున్న రాష్ట్ర మంత్రి నారాయణ
* శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో S S.L.V.D-3 రాకెట్ ప్రయోగానికి మొదలు కానున్న కౌంట్ డౌన్.. రేపు ఉదయం 9.17 గంటలకు S.S.L.V.D-3 రాకెట్ ప్రయోగం.. భూ పరిశీలన కోసం 175 కిలోల బరువైన EOS-08 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న శాస్త్రవేత్తలు
* తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు.. మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ.. 18వ తేదీన కళ్యాణోత్సవ సేవ రద్దు
* తూర్పుగోదావరి జిల్లా : ఉదయం 08:20 గంటల నుండి 12:45 గంటల వరకు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నందు పెరేడ్స్ లో పాల్గొనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
* చిత్తూరు పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించనున్న మంత్రి సత్యకూమార్.. హాజరుకానున్న జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు..
* అనంతపురం : అనంతపురం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించనున్న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.
* విజయనగరం: పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నేడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాని ఆవిష్కరించనున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్..
* తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించనున్న మంత్రి అనం
* తూర్పుగోదావరి జిల్లా: రంగంపేట మండలం వడిశలేరులో డ్రోన్ ద్వారా జాతీయ జెండాను ఎగర వేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి…
* కడప పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతి థిగా హాజరై జెండా ఆవిష్కరణ చేయనున్న మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్…
* అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు… ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ను ఆవిష్కరించనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…
* నేటి నుండి ఈనెల 19 వరకు 5 రోజులపాటు శ్రీశైలంలో శ్రీస్వామివారి స్పర్శ దర్శనం నిలుపుదల.. భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి
* కర్నూలు: నేడు పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి టిజి భరత్
* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో , 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ,జాతీయ పతాకాన్ని ఆవిష్కరించ నున్న, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ , గొట్టిపాటి రవి కుమార్.. గుంటూరు లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి నారా లోకేష్, పల్నాడు జిల్లా నరసరావు పేట లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న నాదెండ్ల మనోహర్, బాపట్ల లో జాతీయ పతాకాన్ని ,
ఆవిష్కరించనున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …
* తిరుమల: 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72967 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 32421 మంది భక్తులు.. హుండీ ఆదాయం 5.26 కోట్లు
* హైదరాబాద్: ఉదయం 8:30 గంటలకు గాంధీ భవన్ లో జెండా ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. 9.20కి పరెడ్ గ్రౌండ్ చేరుకొని సైనికుల స్మారకానికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటకు చేరుకొని పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు.
* నేడు సీతారామ ప్రాజెక్టులోని మూడు గేట్లు ఎత్తనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గోదావరి నది కుడి ఒడ్డున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని దుమ్ముగూడెం వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం.. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని రైతుల ఆయకట్టుకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించాలనేది లక్ష్యం.
* నేడు తెలంగాణలో మూడో విడత రుణమాఫీ.. ఆగస్టు 15వ తేదీ లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన.. ఖమ్మం జిల్లా వైరా మండలంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొని.. నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.. మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ.
* ఢిల్లీ: రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోడీ..
* నేడు ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన .. పూసు గూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్ ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వైరాలో బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల , ఉత్తమ్, పొంగులేటి.. రెండు లక్షల రుణమాఫీ పథకం ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* నేడు బిజీ కొత్తూరు వద్ద మొదటి పంపు హౌస్ ను ప్రారంభించనున్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
* నేడు కమలాపురం వద్ద మూడవ పంప్ హౌస్ ను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
* నేడు ప్రకాశం మైదానం లో జాతీయ జెండా ను ఆవిష్కరించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
* ఖమ్మం : పోలీస్ పరెడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
* నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి దామోదర రాజనర్సింహ.. మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా అవిష్కరించనున్న ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు.. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి పొన్నం ప్రభాకర్
* ఖిల్లా వరంగల్ లో జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్న వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
* హనుమకొండ జిల్లాలో జాతీయ పతాకావిష్కరణ చేయనున్న రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ..
* ములుగు జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)…