NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. దోడాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోడీ

* హైదరాబాద్‌: ఈ నెల 17వ తేదీన జంట నగరాల పరిధిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం.. బదులుగా నవంబర్ 9న వర్కింగ్ డేగా ప్రకటన

* భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే నెల 4వ తేదీ నుంచి భద్రాచలం రామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు.. 12న ఆయుధ పూజ.. భద్రాద్రి వైదిక బృందం

* ఖమ్మం: నేడు మంత్రి పొంగులేటి ఉమ్మడి జిల్లాలో పర్యటన

* ప్రకాశం : ఒంగోలు అంబేద్కర్ భవన్ లో జిల్లా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సామాజిక వర్గ ఉద్యోగుల సదస్సు..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. నెల్లూరు లోని క్యాంప్ కార్యాలయంలో అధికారులతో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

* రాష్ట్ర పురపాలక.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ…. విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లను ఢీకొన్న బోట్లను తొలగించటానికి 4వ రోజుకి చేరిన ఆపరేషన్.. పెద్ద పెద్ద కొక్కెలు క్రెయిన్ల సాయంతో నేడు నది నుంచి బయటకు తీసేందుకు జరగనున్న పనులు

* పోలవరం ప్రాజెక్టు వద్ద తగ్గుతున్న గోదావరి నీటి మట్టం.. స్పిల్ వే వద్ద 32.130 మీటర్ల నీటిమట్టం.. ప్రాజెక్టు 48 గేట్ల నుంచి 884673 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి గోదావరి నదిలో గణేష్ నిమజ్జనాలకు అనుమతి.. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో రాజమండ్రిలో మూడు రోజులుగా నిలిచిపోయిన గణేష్ నిమజ్జనాలు.. గణేష్ నిమజ్జనాలు కోసం పుష్కర్ ఘాట్ వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న ర్యాంపులో ప్రత్యేక ఏర్పాట్లు.. బోటుకు పంటు కట్టి దానిపై గణేష్ విగ్రహాలు గోదావరి మధ్యలోకి తీసుకెళ్ళి నిమజ్జనం

* గుంటూరు: వైసీపీ నేతలకు మరోసారి నోటీసులు జారీ చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు.. నేడు మధ్యాహ్నం ఒంటిగంటకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని వైసీపీ నాయకులకు మరోసారి నోటీసులు.. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి జోగి రమేష్‌, దేవినేని అవినాష్‌కు నోటీసులు జారీ

* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి గోదావరి నదిలో గణేష్ నిమజ్జనాలకు అనుమతి.. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో రాజమండ్రిలో మూడు రోజులుగా. నిలిచిపోయిన గణేష్ నిమజ్జనాలు.. రేపటి నుండి మూడు రోజుల పాటు భారీగా ఊరేగింపులతో. నిమజ్జనానికి తరలి రానున్న గణనాథులు

* శ్రీ సత్యసాయి : ధర్మవరంలో పర్యటించనున్న రోడ్డు రవాణా శాఖ, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.

* శ్రీ సత్యసాయి : పెనుగొండ మండలం దుద్దే బండ గ్రామంలో అంగన్వాడి కార్యాలయాన్ని ప్రారంభించనున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత.

* తిరుమల: 13 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,694 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 27,350 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు

* విజయవాడలో నేడు మెగా లోక్ అదాలత్

* విజయవాడ: నేడు కవయిత్రి మొల్ల విగ్రహావిష్కరణ.. తుమ్మల పల్లి కళాక్షేత్రంలో విగ్రహ ఆవిష్కరణ చేయనున్న బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి

Show comments