NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఇవాళ ఆకాశంలో సుందర దృశ్యం.. కనువిందు చేయనున్న బ్లడ్ మూన్‌.. ఎరుపు – నారింజ రంగులో చందమామ కనువిందు..

* దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు.. ఇవాళ ఉదయం 6 నుంచి రేపు ఉదయం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు.. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్.. వాహనదారులపై రంగులు చల్లొదని పోలీసుల హెచ్చరిక.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్న పోలీసులు

* కాకినాడ: నేడు చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ, హాజరుకానున్న పవన్ కళ్యాణ్.. 50 ఎకరాల ప్రాంగణంలో జయ కేతనం పేరుతో ఆవిర్భావ సభ నిర్వహిస్తున్న జనసేన.. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత తొలి ఆవిర్భావ సభ.. సాయంత్రం నాలుగు గంటల నుంచి 9 గంటల వరకు జరగనున్న సభ

* నేడు జనసేన ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా చలో పిఠాపురానికి పిలుపు.. గోదావరి జిల్లాల నుండి చలో పిఠాపురానికి భారీగా బయలుదేరి వెళుతున్న జనసేన నేతలు కార్యకర్తలు.. రాజమండ్రి నుంచి కార్లు బైకులతో భారీ ర్యాలీ.. దారి పొడవునా రెపరెపలాడుతున్న జనసేన జెండాలు

* ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్‌ పిలుపు.. అసెంబ్లీ నుంచి జగదీష్‌రెడ్డిని సస్పెండ్‌ చేయడంపై నిరసన

* భద్రాద్రి కొత్తగూడెం: నేడు భద్రాచలం రామాలయంలో శ్రీరామ నవమికి తలంబ్రాలు కలిపే ప్రక్రియ ప్రారంభం.. రామాలయంలో హోలీ పండుగ సందర్భంగా స్వామి వారికి వసంతోత్సవం

* నిజామాబాద్ : హోలీ పండగ సందర్భంగా నేడు సాలూరా మండలం హున్సా లో పిడి గుద్దులాట. అనుమతి లేదంటున్న పోలీసులు.. గ్రామ పెద్దలకు నోటీసులు.. సాంప్రదాయ పండగ కు అనుమతి ఇవ్వకపోవడం పట్ల గ్రామస్తుల ఆగ్రహం

* తిరుమల: ఇవాళ పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

* తిరుమల: ఇవాళ కుమారధార తీర్ద ముక్కోటి.. మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనున్నారు టీటీడీ.. తిరుమల నుంచి పాపవినాశనం వరకు ప్రవైట్ వాహనాల అనుమతి నిలిపివేత.. పాపవినాశనం వద్ద భక్తులకు ఉచితంగా అన్నప్రసాద పంపిణీ చెయ్యనున్న టిటిడి

* ఎన్టీఆర్ జిల్లా: నేటి నుంచి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ చిన తిరునాళ్ళు ప్రారంభం.. ఈ నెల 18 వరకు ఐదు రోజులపాటు జరగనున్న తిరునాళ్ళు

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి బోగోలు మండలం బిట్రగుంట లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు

* విశాఖ: సింహాచలం దేవస్థానంలో ఘనంగా డోలోత్సవం.. స్వామివారి కళ్యాణ వేడుకలకు తొలి సన్నాహం… నేడు సింహాగిరిపై ఆర్జిత సేవలు రద్దు

* అనంతపురం: యాడికి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి చెన్న కేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారి కళ్యాణోత్సవం, మహా రథోత్సవం.

* కర్నూలు: నేడు పత్తికొండ (మం) కనక దిన్నెలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ పనులకు భూమి పూజ చేయనున్న మంత్రి టిజి. భరత్, ఎమ్మెల్యే శ్యామ్ కుమార్.

* నేడు తిరుపతికి న్యాయ విచారణ కమిషన్.. తొక్కిసలాట ఘటనపై తిరుమలలో భక్తుల క్యూ లైన్ పరిశీలన.. ఇప్పటికే తొక్కిసలాట బాధితులను వర్చువల్‌గా విచారించిన విశ్రాంత జడ్జి సత్యనారాయణ మూర్తి… విచారణలో భాగంగా తిరుపతి కలెక్టర్‌, ఎస్పీ, టీటీడీ ఈవోకు సమన్లు.. ఈనెల 17న నేరుగా విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ

* తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్‌లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 51,148 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,236 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.56 కోట్లు

* జగిత్యాల జిల్లా: ఘనంగా కొనసాగుతున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేడు కొనేరులో యోగ నరసింహుని తెప్పోత్సవం డోలోత్సవం