* హైదరాబాద్: నేడు గాంధీభవన్‌లో కులగణన, వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షీ
* నేడు సంగారెడ్డి , రేపు నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
* ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన.. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు.. 11 గంటలకు మేడా రఘునాధ్ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.. అనంతరం అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరి వెళతారు..
* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరిగే మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి..
* నెల్లూరు : రేపు కందుకూరులో సీఎం చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు.
* రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కందుకూరులో పర్యటిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలిస్తారు
* నేడు పల్నాడు జిల్లా ఎస్పీని కలవనున్న, సాయి సాధన చిట్‌ఫండ్ కంపెనీ బాధితులు… చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యంతో తాము నష్టపోయామని, యాజమాన్యంపై , డైరెక్టర్లపై, కఠిన కేసులు నమోదు చేయాలని ఎస్పీని కోరనున్న బాధితులు..
* తిరుమల కల్తీ నెయ్యి కేసు నిందితులు నేడు కస్టడీలోకి తీసుకోనున్న సిట్.. నలుగురు నిందితులను ఐదు రోజులు పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నిన్న తిరుపతి కోర్టు ఉత్తర్వులు… శ్రీవారి లడ్డుకు కల్తీ నెయ్యి కేసులో ఇదివరకే నలుగురిని అరెస్టు చేసిన సిట్.
* శ్రీ సత్యసాయి : ధర్మవరంలో జరిగే పలు కార్యక్సమాలలో పాల్గొననున్న మంత్రి సత్యకుమార్.
* తిరుమల: 31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,203 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,793 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు
* విజయవాడ: వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు.. వంశీతో పాటు ఏ7 శివరామకృష్ణ, ఏ8 లక్ష్మీపతికి 14 రోజుల రిమాండ్.. విజయవాడ సబ్ జైలుకు తరలింపు.. ACMM కోర్టులో రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1.45 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు
* కర్నూలు: మంత్రాలయంలో గ్రామ దేవత మంచాలమ్మకు కుంకమ అర్చన, తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతభిషేకం వంటి విశేష పూజలు.. చీర సారె, నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకోనున్న మహిళలు.
* విశాఖ: నేడు నగరానికి రానున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. రాత్రికి NTR భవన్ లో బస.. రేపు విజయనగరం జిల్లా., భోగాపురంలో జరగనున్న వివాహ కార్యక్రమానికి హాజరుకానున్న లోకేష్
* కర్నూలు: ఆస్పరి మండలం ములుగుందం లో శ్రీ దస్తగిరిస్వామి ఉరుసు ఉత్సవాలు…
* నంద్యాల: పాణ్యం (మం) కొత్తూరు శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం లో టెంకాయలు, పూలు అమ్ముకొనుటకు నేడు వేలం పాటలు….
* అనంతపురం : కేంద్ర బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ నగరంలోని టవర్ క్లాక్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
* విజయనగరం: క్లీన్ ఆంధ్ర ప్రదేశ్… తడి చెత్త పొడి చెత్త వాహనాలు రాజీవ్ స్టేడియంలో నిలిపివేసి నేడు నిరసన… జీతాలు, ఏడాదిన్నరగా ఫీఫ్, పెంచిన జీతం నాలుగు నెలల గా చెల్లించాలని డిమాండ్.
* విజయనగరం: నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు…