NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* హైదరాబాద్‌: చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్‌ విడుదల.. జైలు నుంచి గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి వెళ్లిన అల్లు అర్జున్‌.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో గీతా ఆర్ట్స్‌ కార్యాలయం.. అక్కడి నుంచి నివాసానికి చేరుకునే అవకాశం

* మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు..

* ప్రకాశం : ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో రెండవ రోజు కొనసాగనున్న రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ విచారణ. ఉదయం 10 గంటల నుండి విజయ్ పాల్ ని విచారించనున్న ఎస్పీ దామోదర్. నిన్న మొదటి రోజు విచారణ పూర్తయిన అనంతరం రాత్రికి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఉన్న విజయ్ పాల్.

* ప్రకాశం : ఇవాళ నీటి సంఘాల ఎన్నికలు.. మైనర్ ఇరిగేషన్ విభాగంలో 342 డబ్ల్యూయూఏలు, 2.10 లక్షల మంది ఓటర్లుగా ఆయకట్టు రైతులు.. ఇవాళ డబ్ల్యూయూఏలకు, 17న డీసీ లకు ఎన్నికలు… సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు..

* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం.. ఈ సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం,సహస్రదీపాలంకరణ సేవలు రద్దు

* కాకినాడ: నేడు స్టెల్లా ఎల్ పనామా షిప్ లో సేకరించిన బియ్యం శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించనున్న అధికారులు.. ఈ నెల 4 న 36 శాంపిల్స్ సేకరణ, 12 కంపెనీ లకు చెందిన రైస్ కి కాకినాడ సివిల్ సఫ్లై ల్యాబ్ లో పరీక్షలు.. సాయంత్రానికి రానున్న రిపోర్టులు, కలెక్టర్ కి నివేదిక అందించనున్న కమిటీ

* రాష్ట్ర మంత్రులు నారాయణ.. ఆనం రామనారాయణరెడ్డి లు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు..

* అనంతపురం : ఉరవకొండలో మెగా జాబ్ మేళా..హాజరు కానున్న మంత్రి పయ్యావుల కేశవ్.

* శ్రీ సత్యసాయి : పెనుకొండ బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్న మంత్రి సవిత.

* అనంతపురం : జిల్లా వ్యాప్తంగా నేడు సాగునీటి సంఘాల ఎన్నికలు.

* కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్… నేడు జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికలు.. నిన్న వేములలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ముందస్తుగా ఎంపీ హౌస్ అరెస్ట్

* తిరుమల: 7 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,722 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,225 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన కార్యక్రమాల వివరాలు.. రాజమహేంద్రవరం, Y-జంక్షన్ నందు “ఇంధన పొదుపు వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొంటారు. BC స్టడీ సర్కిల్ కేంద్రం నందు “BC విద్యార్థులకు DSC కోచింగ్ ప్రారంభోత్సవం” కార్యక్రమంలో పాల్గొంటారు. “ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ మీటింగ్” కార్యక్రమంలో పాల్గొంటారు. రాజమహేంద్రవరం, నారాయణపురం, సెంట్రల్ జైలు రోడ్డు నందు “స్టైల్ యూనియన్ స్టోర్” ప్రారంభిస్తారు.

* అల్లూరి జిల్లా: మన్యంలో మరోసారి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు.. అరకులోయలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రత…. విపరీతంగా కురుస్తున్న మంచు. చలికి వణుకుతున్న గిరిజనం. పర్యాటకులను అలరిస్తున్న మాడగడ వ్యూ పాయింట్. మాడగడ మేఘాలకొండకు భారీగా చేరిన పర్యాటకులు.

* అనంతపురం : మార్గశిర పౌర్ణమి సందర్భంగా నేడు శివకోటి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వత్రాలు.

* కడప : నేడు సాగునీటి సంఘాలకు ఎన్నికలు.. నేడు చెరువులు క్రింద సాగునీటి సంఘాలకు ఎన్నికలు… కడప జిల్లాలో 206, అన్నమయ్య జిల్లాలో 167 సాగునీటి సంఘాలకు ఎన్నికలు.. రహస్య బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల నిర్వహణ..

* అన్నమయ్య జిల్లా : నేడు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో నేడు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్…

* విజయవాడ: నేడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు.. హాజరు కానున్న సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

* ఇవాళ గుడ్లవల్లేరులో సీఎం చంద్రబాబు పర్యటన… సాయంత్రం నాలుగు గంటలకు డోకిపర్రు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనున్న సీఎం.. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు.. సాయంత్రం 6 గంటలకు మురళీ రిసార్ట్స్ లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలకు చంద్రబాబు

* తిరుపతి: నేడు సాగునీటి సంఘాలకు ఎన్నికలు .. నేడు చెరువులు క్రింద సాగునీటి సంఘాలకు ఎన్నికలు… జిల్లాలో 610 సాగునీటి సంఘాలకు ఎన్నికలు.. రహస్య బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల నిర్వహణ.. సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించిన వైసిపి…

* శ్రీ సత్యసాయి : మడకశిర మండలంలోని భక్తరపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జిల్లేడుగుంట శ్రీ ఆంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా జిల్లేడుగుంట ఆంజనేయస్వామి సన్నిదిలో శ్రీవారి కళ్యాణోత్సవం.

* అనంతపురం : మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో 10వ రాష్ట్ర మహాసభలు.

* శ్రీ సత్యసాయి : పెనుకొండ బాబయ్య దర్గాకు చాదర్ సమర్పించిన మంత్రి సవితమ్మ. పెనుకొండ పట్టణంలో ఘనంగా బాబయ్య ఉరుసు మహోత్సవం.

* నేడు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మంత్రి కొండా సురేఖ పర్యటన.. మెదక్ జిల్లా నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ ని సందర్శించనున్న మంత్రి.. సంగారెడ్డి జిల్లా హత్నూరలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్న మంత్రి కొండా సురేఖ

* ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ 10.4, కోహిర్ 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

* ఖమ్మం జిల్లా : నేడు మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. బోనకల్, చింతకాని మండలాల్లో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన. బోనకల్ లోని గురుకుల పాఠశాలను సందర్శించి.. విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్న భట్టి విక్రమార్క.

* ఖమ్మం: నేడు జిల్లాల్లో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి ల పర్యటన

* ఆదిలాబాద్. ఇవ్వాళ ఉమ్మడి జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన. ఉదయం నిర్మల్ జిల్లా కడెం మండల పర్యటన. ఆ తరువాత ఆదిలాబాద్ జిల్లాలో లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి. నేరడిగొండ ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు),ను తనిఖీ చేయనున్న మంత్రి సీతక్క..

* ఆదిలాబాద్ జిల్లా పై చలి పులి పంజా. రికార్డు స్థాయిలో పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్ జిల్లా బేల లో 6.6 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. కొమురం భీం జిల్లా సిర్పూర్ యు లో 6.7 గా నమోదు. నిర్మల్ జిల్లా పెంబి లో 9.3.. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి లో 12.2గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. రాష్ట్రంలో నే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నే నమోదు

Show comments