* ఢిల్లీ ఎయిమ్స్‌లోనే సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయం.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వసంత్‌కుంజ్ లోని ఆయన నివాసానికి తరలింపు.. రేపు ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి తరలింపు.. రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ప్రజా సందర్శనార్థం పార్టీ కార్యాలయంలో భౌతికకాయం.. అనంతరం రేపు సాయంత్రం 5 గంటలకు డెడ్ బాడీ ఎయిమ్స్‌కు అప్పగింత.. అంత్యక్రియలు లేకుండా భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి ఏచూరి భౌతికకాయాన్ని అప్పగించనున్న కుటుంబ సభ్యులు
* ఢిల్లీ: నేడు సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు.. సీబీఐ లిక్కర్ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్.. ఈడీ కేసులో బెయిల్ వచ్చినా.. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో తీహార్ జైల్లోనే ఉన్న కేజ్రీవాల్
* నేడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం… పశ్చిమ వాయువ్యం పయనించి బెంగాల్ సమీపంలో వాయుగుండంగా మారుతుందని IMD అంచనా… తెలుగు రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం స్వల్పంగా వుండే అవకాశం.. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, రాయలసీమ, దక్షిణ కోస్తాలో చెదురు మదురుగా వర్షాలు
* హైదరాబాద్: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు.. ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని సవాల్ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. బీఆర్‌ఎస్ కార్యకర్తలందరూ తరలిరావాలంటూ పిలుపు.. నిన్న ఎమ్మెల్యే గాంధీ వెళ్లడంతో కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా నేడు గాంధీ ఇంటి దగ్గర పోలీసుల బందోబస్తు.
* మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటారు..
* ఒంగోలు సీపీఎం కార్యాలయంలో సీతారాం ఏచూరి సంతాప సభ..
* ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ గంగాడ సుజాత ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం..
* ప్రకాశం : ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి..
* తిరుమల: అక్టోబర్ 4వ తేది నుంచి 12వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం అవుతారు
* రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ .. విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* తూర్పుగోదావరి జిల్లా: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ .. వేగంగా తగ్గుముఖం పడుతున్న గోదావరి వరద ప్రవాహం.. బ్యారేజీ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక .. బ్యారేజీ కి సంబంధించిన 175 గేట్లు పూర్తిగా ఎత్తివేత
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణతో చేరుకుంటున్న జిల్లాలోని లంక గ్రామాలు.. ఇంకా జలదిగ్బంధంలోనే కొనసాగుతున్న. 46 లంక గ్రామాలు .. పడవలపైనే ప్రయాణాలు కొనసాగుతున్న లంక గ్రామాల వాసులు
* శ్రీ సత్యసాయి : హిందూపురంలో వినాయకుడి శోభాయాత్ర, నిమజ్జనానికి గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు.
* గుంటూరు: నేడు జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలు..
* గుంటూరు: రేపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న, న్యాయస్థానాల్లో మెగా లోక్ అదాలత్..
* గుంటూరు: నేడు మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన, రెండు కోట్ల 30 లక్షల రూపాయల లక్ష్మీ గణపతి అలంకరణ పూజా కార్యక్రమంలో, పాల్గొననున్న మంత్రి నారా లోకేష్..
* తిరుమల: 9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,544 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,942 మంది భక్తులు.. హుండీ ఆదాయం 3.37 కోట్లు
* అనంతపురం : గుంతకల్లు ర్తెల్వే కార్మిక సంఘాల గుర్తింపు కోసం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ఈనెల 18న ఓటర్ల జాబితా ప్రకటన,డిసెంబర్ 4,5,6 తేదీలలో పోలింగ్.
* కాకినాడ: నేడు పిఠాపురంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటన.. యూ. కొత్తపల్లి మండలం మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాలలో ఏలేరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న మాజీ సీఎం.. ఎన్నికల ఫలితాలు తర్వాత తొలిసారి జిల్లాకి జగన్..
* గుంటూరు: నేడు మంగళగిరి కోర్టులో, మాజీ ఎంపీ నందిగం సురేష్ కస్టడీ పిటిషన్ పై తీర్పు వచ్చే అవకాశం… ఇప్పటికే పూర్తయిన ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు…
* అల్లూరి సీతారామరాజు జిల్లా: భద్రాచలం వద్ద అన్ని ప్రమాద హెచ్చరికలు ఉపసంహరణతో తేరుకుంటున్న విలీన మండలాలు.. భద్రాచలం వద్ద 40.50 అడుగులు కొనసాగుతున్న గోదావరి వరద నీటిమట్టం .. చింతూరు, కూనవరం, వి.ఆర్. పురం, ఏటపాక మండలాలకు రాకపోకలు పునరుద్ధరణ.. పునరావాస కేంద్రాల నుండి ఇళ్లకు చేరుకుంటున్న వరద బాధితులు
* శ్రీ సత్యసాయి : రొద్ధం మండలంలోని కందుకూర్లపల్లి గ్రామంలో కోటి 25 లక్షల నిధులతో సిసి రోడ్ల పనులను ప్రారంభించనున్న మంత్రి సవిత.