NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* హైదరాబాద్‌: నేడు భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య చివరి టీ-20 మ్యాచ్‌.. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా రాత్రి 7.30కి ప్రారంభంకానున్నర మ్యాచ్‌.. ఇప్పటికే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్..

* తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వరహా పుష్కరిణిలో శాస్రోక్తంగా సాగుతున్న చక్రస్నానం.. రాత్రి 8 గంటలకు ధ్వజాఅవరోహణంతో ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.. రేపటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరణ

* నేటి నుండి స్కిల్ యూనివర్సిటీ అడ్మిషన్లు ప్రారంభం… తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరులో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు

* విజయవాడ: దసరా శరన్నవరాత్రులలో విజయదశమి పర్వదినాన ఇంద్రకీలాద్రిపై రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనం ఇస్తున్న కనకదుర్గమ్మ..

* రాజమండ్రి దేవి చౌక్ లో ఘనంగా విజయదశమి వేడుకలు.. విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు.. నేటితో నేత్రపర్వంగా ముగియనున్న 91వ బాల త్రిపుర సుందరి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. ప్రత్యేక పూజలు కుంకుమ పూజలు నిర్వహిస్తున్న భక్తులు

* అనంతపురం : జిల్లాలో సాగు, తాగు నీరు సమస్యలపై సీపీఎం బస్సు యాత్ర… ఈ నెల 15 నుంచి 20 వరకు కొనసాగునున్న యాత్ర.

* అనంతపురం : తాడిపత్రిలో చింతలరాయుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

* శ్రీ సత్యసాయి : హిందూపురం పట్టణంలో శ్రీమారెమ్మ దేవాలయంలో జ్యోతుల ఉత్సవం.

* శ్రీసత్యసాయి : శరన్నవరాత్రి  ఉత్సవాల్లో భాగంగా  నేడు  శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి దేవాలయంలో   విజయదశమి మహిషాసుర మర్దిని అలంకారణలో భక్తులకు దర్శనం  ఇవ్వనున్న దుర్గామాత

* కర్నూలు: నేడు దేవరగట్టు కర్రలసమరం.. శ్రీ మాలమలేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలకు భారీ బందోబస్తు.. 800 మంది పోలీసులతో బందోబస్తు.. 100 నైట్ విజన్ సీసీ కెమెరాలు , 700 ఎల్ఈడి లైట్లు 5, డ్రోన్ కెమెరాలతో నిఘా.. 148 మంది పై బైండోవర్ కేసులు నమోదు

* శ్రీశైలంలో చివరిరోజుకు చేరుకున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. సాయంత్రం భ్రమరాంబికాదేవి నిజరూపాలంకరణలో భక్తులకు దర్శనం .. నందివాహనంపై పూజలందుకొనున్న శ్రీస్వామి అమ్మవార్లు.. నందివానంపై ఆది దంపతులకు ఆలయ ప్రకరోత్సవం, జమ్మివృక్షం వద్ద శమీపూజలు.. రాత్రి శ్రీస్వామి అమ్మవారి తెప్పోత్సవంతో దసరా మహోత్సవాలు ముగింపు

* తిరుమల: 12 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,443 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 26,948 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 2.52 కోట్లు

* శ్రీ సత్యసాయి : దసరా వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలో వేద పురుష సప్తామా జ్ఞాన యజ్ఞాం. నేడు మహా పూర్ణాహుతితో ముగియనున్న కార్యక్రమం.

Show comments