NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఢిల్లీ: ఇవాళ సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ.. లిక్కర్‌ పాలసీ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత.. ఇప్పటికే కవితకు బెయిల్ నిరాకరించిన ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు

* నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన.. జిల్లాల్లో పర్యాటక అభివృద్ధిపై చారిత్రిక, పర్యాటక ప్రాంతాల పరిశీలన

* ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో నేడు తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయిన తాజా పరిస్థితులను పరిశీలించేందుకు హస పేటె వెళ్తున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. మంత్రితోపాటు వెళ్తున్న జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ తదితరులు.

* శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు.. శ్రీశైలం డ్యాం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల

* నెల్లూరు రూరల్ పరిధిలోని స్కంద లే ఔట్.లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

* తిరుమల: ఎల్లుండి పవిత్రోత్సవాలుకు అంకురార్పణ.. ఎల్లుండి సాయంత్రం మాడవీధులలో ఉరేగునున్న శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు.. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ.. 15వ తేది నుంచి 17వ తేది వరకు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు.. మూడు రోజులు పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టిటిడి

* ప్రకాశం : మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు హాజరవుతారు..

* గుంటూరు: నేడు తెనాలి రణరంగ్ చౌక్ లో ,క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన, అమరవీరులకు నివాళి అర్పించనున్న, కేంద్ర రాష్ట్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ నాదెండ్ల మనోహర్, తదితరులు…

* పల్నాడు: నేడు నాదెండ్ల మండలం, చిరుమామిళ్ల లో పర్యటించనున్న కేంద్ర ఆర్థిక వ్యవహారాల జాయింట్ సెక్రెటరీ సోలమన్.. జలజీవన్ మిషన్ పథకం పనులను పరిశీలించనున్న, సోలమన్ అరోకి రాజ్….

* గుంటూరు: నేడు తెనాలిలో క్విట్ ఇండియా అమరవీరుల నివాళి సందర్భంగా, మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆధ్వర్యంలో ,ర్యాలీ నిర్వహించనున్న టిడిపి శ్రేణులు.. రణరంగ్ చౌక్ లో అమరవీరులకు నివాళి..

* విశాఖ: నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ… మధ్యాహ్నం 12 గంటల సమయంలో కలెక్టరేట్ లో నామినేషన్‌..

* నేడు ఏలూరులో పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన.. ధాన్యం సొమ్మును సంబంధిత రైతులకు చెక్కుల ద్వారా పంపిణీ

* నేడు ఏలూరు కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ – పీ .జీ. ఆర్ .ఎస్. కార్యక్రమం.

* విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీపై వీడనున్న ఉత్కంఠ… నేడు అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇవ్వనున్న హైకమాండ్. విస్తృత సమావేశం తర్వాత హైకమాండ్ కు నివేదిక సమర్పించిన కమిటీ..

* సుంకేసుల జలాశయంకు కొనసాగుతున్న వరద.. ఇన్ ఫ్లో 33,100 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 30,177 క్యూసెక్కులు, 7 గేట్ల ఎత్తివేత

* నేడు శ్రీశైలంలో సోమవారం వారాంతపు సేవలలో భాగంగా శ్రీస్వామి అమ్మవారికి ఆలయంలో వెండి రధోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ

* తిరుమల: 14 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 86,604 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 31,536 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు

* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించునున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పాల్గొనున్నారు

* తూర్పు గోదావరి జిల్లా: నేడు రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనితా రాజమండ్రిలో పర్యటన .. ఉదయం 9.30 గంటలకి జైళ్లశాఖ ఆధ్వర్యంలోని కోటిపల్లి బస్టాండ్ సమీపంలో నిర్మించిన పెట్రోల్ బంకు ప్రారంభిస్తారు. అనంతరం కేంద్ర కారాగారం సందర్శన.. మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద నిర్మించిన ప్రిజన్ కేఫ్, బాక్స్ క్రికెట్ ప్రారంభిస్తారు.

* శ్రీ సత్యసాయి : హిందూపురం లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుందరదేవి