NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఇవాళ ఢిల్లీ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ చార్జ్‌పై ఇవాళ ట్రయల్ కోర్టులో విచారణ.. ట్రయల్ కోర్టుకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత, ఇతర లిక్కర్ కేస్ నిందితులు.. ట్రయల్ కోర్ట్ విచారణకు వర్చువల్ గా హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు

* హర్యానా: జులనా స్థానం నుంచి నేడు నామినేషన్ దాఖలు చేయనున్న వినేష్ ఫోగట్

* హైదరాబాద్‌: నేడు మధ్యాహ్నం సచివాలయంలో జీహెచ్ఎంసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

* భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50 అడుగులు.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ

* ఖమ్మం: నేడు, రేపు జిల్లాల్లో వరద అంచనా కోసం కేంద్ర బృందం పర్యటన

* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,380 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,405 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు

* తిరుమల: ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్న కర్నాటక గవర్నర్ థాపర్చంద్ గ్లేహట్, కేంద్రమంత్రి సురేష్ గోపి

* ప్రకాశం : మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటారు..

* ప్రకాశం : దోర్నాల మండలం చిన్న గుడిపాడులో ఆర్డీటి కార్యాలయంలో పీఎం-జన్ మన్ కార్యక్రమంలో పాల్గొననున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా..

* ప్రకాశం : ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి..

* తూర్పుగోదావరి: ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక జారీ.. బ్యారేజ్ నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెంఢో ప్రమాద హెచ్చరిక జారీ.. బ్యారేజీ నుండి 13 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలో విడుదల

* నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. ఏలేరు వరద ముంపు గ్రామం రాజుపాలెం గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన.. ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడనున్న సీఎం.. సామర్లకోటలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం.. ఏలేరు ఆధునీకరణ, తీసుకోవలసిన చర్యలపై రివ్యూ

* రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు.. విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* అనంతపురం : జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనం…ప్రధాన కూడళ్లలో పోలీసుల బందోబస్తు.

* శ్రీ సత్యసాయి : హిందూపురంలో నేటి నుంచి రాష్ట్రస్థాయి బాల , బాలికల బ్యాడ్మింటన్ పోటీలు.

* ఏలూరు: సీఎం చంద్రబాబు పర్యటన లో మార్పు… పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన వాయిదా.. ఏలూరు జిల్లాలో పర్యటన.. బుధవారం ఉదయం 11.10 హెలికాప్టర్ లో ఏలూరు సి ఆర్ రెడ్డి కళాశాల కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు. 11. 25 కు తమ్మిలేరు బ్రిడ్జికి చేరుకొని వరద పరిస్థితిని పరిశీలించి ,11:45 కు సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియం చేరుకుంటారు. అక్కడ రైతులు వరద బాధితులతో మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 12:30 కు సి ఆర్ రెడ్డి కళాశాల హెలిపాడ్ కు చేరుకొని హెలికాప్టర్లో సామర్లకోట వెళ్తారు.

* కర్నూలు: నేడు నంద్యాల, ఆదోనిలో గణేశ నిమజ్జనం.. భారీ బందోబస్తు

* నంద్యాల : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. జలాశయం 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత.. ఇన్ ఫ్లో 1,44,155 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,23,258 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* అనంతపురం : జిల్లాలో నేడు గణేష్ శోభాయాత్ర. ప్రధాన కూడళ్లలో సాగనున్న వినాయకుల ఊరేగింపు. కొడిమి వంక,పంపనూరు,రాప్తాడు పండమేరు ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు.

* అనంతపురం : దులీప్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి రెండు మ్యాచులు. ఇండియా టీం – ఏ వర్సెస్ ఇండియా టీం-డీ. ఇండియా టీం – బీ వర్సెస్ ఇండియా టీం- సీ.