NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* లావోస్‌లో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. 21వ ఆసియాన్-ఇండియా మరియు 19వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొననున్న భారత ప్రధాని

* హైదరాబాద్‌: నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి షాద్ నగర్ నియోజక వర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన.. మధిర నియోజకవర్గం బొనకల్ మండలం లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన

* నేడు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన.. జిల్లాలో మూడు చోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ ల శంకుస్థాపన చేయనున్న మంత్రులు.. బొనకల్ మండలం లక్ష్మి పురం లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రఘునాథ పాలెం మండలం జింకల తండాలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

* రేపు భద్రాచలం రామాలయంలో దసరా వేడుకలు.. శ్రీరామ లీల మహోత్సవం.. శ్రీరామ పట్టాభిషేకం

* నేడు భద్రాచలం లోని రామాలయం లో వీర లక్ష్మి అవతారంలో దర్శనమివ్వనున్నా అమ్మవారు

* తిరుమల: 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,775 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,288 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు

* ప్రకాశం : త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు మరియు శ్రీ పార్వతి దేవి అమ్మవార్ల శరన్నవరాత్రుల మహోత్సవాలు… 9వ రోజు అమ్మవారు శ్రీ శిద్ధిదాయిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు… పల్లకి సేవ అశ్వవాహనంలో భక్తులకు దర్శనిమిస్తారు.

* నేడు విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

* తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి దేవిచౌక్ లో 9వ రోజుకు చేరిన శరన్నవరాత్రి ఉత్సవాల్లో మహిషాసుర మర్ధిని అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మ వారు..

* శ్రీశైలంలో 9వరోజు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. సాయంత్రం సిద్ధిదాయిని అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం.. అశ్వవాహనంపై పూజలందుకోనున్న అది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం

* నంద్యాల: నేడు శ్రీశైలంలో దసరా సందర్భంగా శ్రీస్వామి అమ్మవారికి ఏపీ ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఆనం రామనారాయరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

* విజయవాడ పర్యటనలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.

* అనంతపురం : నగరంలోని శివకోటి శ్రీపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నవచండీయాగం.

* పల్నాడు జిల్లా ఐసిఐసిఐ బ్యాంకు బ్రాంచ్ ల్లో జరిగిన స్కాం వ్యవహారం విచారణ చేసేందుకు ,రంగంలోకి దిగిన సిఐడి అధికారులు.. నేడు కూడా సిఐడి విచారణ కొనసాగే అవకాశం .

* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు 9వ రోజు.. నేడు మహిషాసురమర్ధినిగా దర్శనం ఇస్తున్న కనకదుర్గమ్మ.. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో భక్తులు..

* శ్రీసత్యసాయి : లేపాక్షిలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి దేవాలయంలో దుర్గాష్టమి ఆయుధపూజ, మహా చండీ అలంకారణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న దుర్గామాత

* తిరుమల: రేపటితో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఇవాళ ఉదయం శ్రీవారి రథోత్సవం.. మహారథం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. రాత్రి 7 గంటలకు అశ్వవాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

* పశ్చిమ గోదావరి: నేటితో ముగియనున్న మద్యం షాపుల దరఖాస్తు గడువు.. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 175 మద్యం షాపులకు ఇప్పటివరకు 4,495 దరఖాస్తులు..

* ఉమ్మడి గుంటూరు జిల్లా లో నేటితో ముగియనున్న మద్యం టెండర్ల అప్లికేషన్ల గడువు… నేడు చివరి రెండు గంటల్లో భారీగా మద్యం టెండర్లకు అప్లికేషన్లు వేసే అవకాశం …

* తిరుపతి జిల్లా లో నేటితో ముగియనున్న మద్యం టెండర్ల అప్లికేషన్ల గడువు… 227 మద్యం దుకాణాలకు గాను 2589 దరఖాస్తులు నమోదు..

* విజయవాడ: దసరా ఉత్సవాల్లో భాగంగా నేడు నారీ శక్తి విజయోత్సవం.. కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి, తెలంగాణ సీఎం రేవంత్ భార్య గీతా రెడ్డి, హోమ్ మంత్రి అనిత

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు

* గుంటూరు: నేడు మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలో పంట పొలాలను పరిశీలించనున్న నీతి ఆయోగ్ బృందం..

Show comments