NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ముంబై: నేడు బీసీసీఐ సమీక్ష సమావేశం.. న్యూజిలాండ్‌ చేతిలో క్లీన్‌స్వీప్‌.. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీలో టీమిండియా ఓటమిపై చర్చ

* నేడు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును పరిశీలించనున్న పవన్ కల్యాణ్.. ప్రాజెక్టును అన్ని వైపుల నుంచి పరిశీలించనున్న డిప్యూటీ సీఎం.. ఆసియాలోనే అతి పెద్దైన పిన్నాపురం గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్.. విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్.. యూనిట్ దగ్గర ఉండటం ప్రత్యేకత.. మొత్తం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్న డిప్యూటీ సీఎం పవన్.

* నేడు కడప జిల్లా పులివెందులకు వైఎస్‌ జగన్.. సమీప బంధువు వైఎస్‌ అభిషేక్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న జగన్..

* నల్లగొండ: నేడు నాగార్జున సాగర్ కు మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ హౌజ్ లో నిర్వహించే ఆదివాసీ నాయకుల సాధికారత శిక్షణ కార్యక్రమం లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం, మంత్రులు.

* ఏలూరు: నేడు పోలవరంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం పర్యటన.. 2021 నుంచి పోలవరం ప్రాజెక్టు కోసం చేసి వ్యయాలను ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలించనున్న కమిటీ

* శ్రీశైలంలో నేటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం.. సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం.. రేపటి నుంచి శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు, వివిధ వాహన సేవలు..

* గుంటూరు: నేడు వడ్డే ఓబన్న జయంతోత్సవం .. కార్యక్రమంలో పాల్గొననున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత…. పలువురు ప్రజాప్రతినిధులు….

* ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుదుపాలెం లోని క్యాంప్ కార్యాలయంలో ఉంటారు..

* మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల జిల్లా అద్దంకి, పంగులూరు మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నెల్లూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఏ .ఎస్. పేట మండలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు

* తిరుమల: వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.. కట్టుదిట్టంగా భధ్రతా ఏర్పాట్లు చేసిన అనంతపురం రేంజ్ డిఐజి షిమోగి

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేటి నుంచి ఆత్రేయపురంలో కేరళ తరహాలో పడవల పోటీలు.. భారీగా ఏర్పాట్లు.. రెండు తెలుగు రాష్ట్రాల నుండి పడవల పోటీలో పాల్గొననున్నా. క్రీడాకారులు

* ఏపీలో నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు.. ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి పండుగ సెలవులను ప్రకటించిన విద్యా శాఖ.. ఈనెల 17 వరకు ఏడురోజులపాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు.. ఈనెల 16 వరకు ఆరురోజులపాటు జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులు. .. ఈనెల 18న పాఠశాలలు, 17న జూనియర్‌ కాలేజీల్లో తిరిగి తరగతులు ప్రారంభం

* తిరుపతి: రేపటి నుండి నాలుగు రోజుల పాటు సిఎం చంద్రబాబు తిరుపతి పర్యటన.. రేపు 1.30గంటలకు రేణి గుంట విమానాశ్రయానికి చంద్రబాబు.. తిరుచానూరు సమీపంలో శంకర్ రెడ్డి నివాసంలో ఏజీఅండీపీ గ్యాస్ సంస్థ ఇంటింటికి ఏర్పాటు చేసిన గ్యాస్ కనెక్షన్ కార్యక్రమానికి ప్రారంభించనున్న సిఎం.. అనంతరం 2.20 గంటలకు తాజ్ హోటల్ కు చేరుకుని, ఏజీ అండ్పీ గ్యాస్ సంస్థ ఏర్పాటు కార్యక్రమంలో చంద్రబాబు.. రేపు సాయంత్రం నారా వారిపల్లెకు చేరుకోనున్న….. 13, 14, 15 తేదీల్లో వరకు నారావారిపల్లెలోనే చంద్రబాబు ..

* పశ్చిమ గోదావరి: నేడు ఆకివీడు లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటన.. ఆకివీడు ఆసుపత్రిలోని నూతన భవనాన్ని డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించనున్న మంత్రి..

* తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసు విచారణ మొదలు… ఒకవైపు డీఐజీ శెముషీ బాజ్ వాయ్ ఆధ్వర్యంలో కోనసాగుతున్న విచారణ.. విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి, టీటీడీ మాజీ సీవీఎస్ వో, తూర్పు గోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ ను దర్యాప్తు అధికారులుగా నియమించిన ప్రభుత్వం.. నేడు ఆయా తొక్కిసలాట జరిగిన ప్రాంతాలలో పర్యటించే అవకాశం

* శ్రీ సత్యసాయి : పుట్టపర్తిలో సత్యసాయి విశ్వవిద్యాలయ 43వ క్రీడా సమ్మేళనం.. క్రీడ ఉత్సవాలకు ముస్తాబైన హిల్ వ్యూ స్టేడియం.. అలరించనన్ను విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు అబ్బురపరిచే క్రీడా విన్యాసాలు

* విశాఖ: గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజులు విశాఖ పర్యటన.. ఇవాళ రాత్రికి నగరానికి చేరుకోనున్న గవర్నర్

* నేడు బెజవాడలో సంక్రాంతి ఆత్మీయ కలయిక.. ముఖ్య అతిథిగా రానున్న మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

* తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,094 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 14,906 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.2.45 కోట్లు

* కర్నూలు: నేడు దేవనకొండ (మం) కప్పట్రాళ్ల సంక్రాంతి సంబరాలలో పాల్గొననున్న ఈగల్ ఐజి ఆర్కే రవికృష్ణ, ఎస్పీ బిందు మాధవ్

* నంద్యాల: నేడు నందికొట్కూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా.. జీతాలు పెంచాలని, నెలనెలా జీతాలు చెల్లించాలని డిమాండ్..

* వరంగల్: నేటి నుంచి ప్రవేట్ , నెట్వర్క్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 63 ప్రైవేట్ ఆస్పత్రి సేవలు నిలిపివేత.. తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ నిలిపివేసిన ప్రైవేట్ హాస్పిటల్స్..

* నేడు ఖమ్మం లో మంత్రి తుమ్మల కాంగ్రెస్ కార్యకర్త ల తో విస్తృత స్థాయి సమావేశం

Show comments