NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* హైదరాబాద్‌: నేడు విద్యుత్ సంస్థల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రివ్యూ. రానున్న రోజుల్లో మరింతగా విద్యుత్ డిమాండ్ పెరుగనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం

* హైదరాబాద్‌: తెలంగాణలో బీర్ల ధరల సవరణ.. 15 శాతం ధరల పెంపును సిఫారసు చేసిన రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ.. సిఫారసు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం.. ధరల సవరణతో 15 శాతం పెరగనున్న బీర్ల ధరలు.. ఇవాళ్టి నుంచి అమల్లోకి పెరిగిన ధరలు

* అమరావతి: ఇవాళ అన్ని శాఖల కార్యదర్సులతో సీఎం చంద్రబాబు, మంత్రుల సమావేశం.. ఉదయం 10 30 నుంచి సాయంత్రం 6 వరకు రెండు సెషన్స్‌గా మీటింగ్.. మొదట సెషన్ లో ఫైళ్ల క్లియరెన్స్, జీఎస్డీపీపై చర్చ.. రెండో సెషన్ లో కేంద్ర బడ్జెట్.. ఏపీ బడ్జెట్ పై చర్చ

* అమరావతి: ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్‌లో విప్‌లతో చీఫ్ విప్ సమావేశం.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఎమ్మెల్యేలకు అవగాహన తరగతులపై చర్చ

* అల్లూరి సీతారామరాజు జిల్లా: నేడు, రేపు ఏజెన్సీ బంద్.. 1/70 చట్టం పరిరక్షణ డిమాండ్ తో 48 గంటలు బంద్ పాటిస్తున్న గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీలు.. అరకు, పాడేరు ఏరియాలో పర్యాటక కేంద్రాలు మూసివేత… నేడు జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంటడంతో ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించిన పోలీసులు.

* అమరావతి : ఇవాళ వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్.. పలువురు నేతలతో సమావేశాలు.. సమాలోచనలు…

* తిరుమల: రేపు పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

* మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ లు అమరావతిలో సీఎం చంద్రబాబుతో కలసి అన్నీ శాఖల కార్యదర్శుల సమావేశంలో పాల్గొంటారు..

* విజయవాడ: నేటితో ముగియనున్న మేరీ మాత ఉత్సవాలు.. మూడు రోజులపాటు జరిగిన ఉత్సవాలు

* విజయవాడ: నేటి నుంచి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్ళు ప్రారంభం.. ఈ నెల 15 వరకు జగరనున్న తిరునాళ్ళు.. బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు

* అమరావతి: మాజీ మంత్రి విడదల రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ.. చిలకలూరి పేట పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు.బెయిల్ ఇవ్వాలన్న మాజీ మంత్రి

* రాష్ట్ర మంత్రులు నారాయణ.. ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* శ్రీ సత్యసాయి : హిందూపురం పట్టణంలో శ్రీ పేట వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కల్యాణోత్స వేడుకలు.

* అనంతపురం : గుత్తి మండలం తొండపాడు బొల్లికొండ శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహానికి గజ వాహనంపై ఊరేగింపు.

* కర్నూలు: నేడు కోడుమూరు శ్రీ చౌడేశ్వరిదేవి తిరునాళ్ల మహోత్సవాలలో ప్రభోత్సవం

* నంద్యాల: గడివేముల లో నేడు నూతన సచివాలయం, ఆర్.బి.కె సెంటర్ ను ప్రారంభించనున్న ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి..

* శ్రీకాకుళం: నేడు మందస మండలంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పర్యటన.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కుంటికోట లోని యూత్ ట్రైనింగ్ సెంటర్ లో జరిగే ఆర్వోలు ( రిటర్నింగ్ అధికారులు) ఏ ఆర్వోలు, బి ఎల్ ఓ లతో సమీక్షా సమావేశం.

* తిరుప‌తి – ప్రయాగ్ రాజ్ బ‌స్సును జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు.. పాల్గొన్న టిటిడి బోర్డు స‌భ్యులు భానుప్రకాష్ రెడ్డి, టూరిజం ఆర్డీ ర‌మ‌ణ ప్రసాద్, డివిఎం శ్రీనివాసులు..

* విజయనగరం: నేడు 1/70 పరిరక్షణ కు పార్వతీపురం మన్యం‌ జిల్లా‌ వ్యాప్తంగా గిరిజనలు ఆందోళన… మద్దతు పలికిన గిరిజన జేఏసీ..

* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 చట్టంపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బైక్ ర్యాలీ చేయనున్న గిరిజన నాయకులు