NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న పిటిషనర్‌.. హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని కోరిన పిటిషనర్‌, ఇవాళ వాదనలు విననున్న తెలంగాణ హైకోర్టు

* హైదరాబాద్‌: నేడు ప్రజాభవన్ లో 16వ కేంద్ర ఆర్థిక సంఘం బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు భేటీ..

* మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటారు..

* ప్రకాశం : మార్కాపురం, యర్రగొండపాలెంలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా..

* రాష్ట్ర పురపాలక.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ … రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు.. విజయవాడ జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు

* తూర్పుగోదావరి జిల్లా: ఉదయం 09:30 గంటలకు బెంగళూరు, చిక్కబల్లాపూర్ నందు ఆది యోగి ఇషా ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్.. ఉదయం 11:30 గంటలకు నంది హిల్స్ లోని టూరిజం స్పాట్ల సందర్శన.. సాయంత్రం 05:30 గంటలకు చెన్నైలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు.

* శ్రీకాకుళం: వర్షాలు తగ్గినా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ … ఒరిస్సాలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్‌..

* అనంతపురం : గుంతకల్లు మండలం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తాదుల స్వామి వారికి సమర్పించిన హుండీకు కానుకల లెక్కింపు.

* తూర్పుగోదావరి జిల్లా: ఎగుప్రాంతల్లో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి.. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 8 పాయింట్ 3 అడుగులకు చేరిన. నీటిమట్టం

* అల్లూరి జిల్లా: భారీ వర్షాలు కారణంగా నేడు జిల్లాలో విద్యాసంస్థలకు సెలపు ప్రకటించిన కలెక్టర్

* నేడు గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో, ఏపీ గ్రామపంచాయతీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర స్థాయి సదస్సు…

* గుంటూరు: నేడు అరండల్ పేటలోని రైల్వే ఉద్యోగుల సంఘం, సమావేశ మందిరంలో, చుండూరు దళిత వీరుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ 33వ స్మారక సభ…

* గుంటూరు: నేడు తెనాలిలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో, ప్రముఖ శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ అవార్డు ప్రధానోత్సవం.. ఎల్ఐసి చైర్మన్ మోటుపల్లి ప్రసన్నకుమార్ కు అవార్డు ప్రధానం చేయనున్న నిర్వాహకులు… హాజరుకానున్న మంత్రి నాదెండ్ల మనోహర్..

* విశాఖ: స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నేడు రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాలు ధర్నాలు. కుర్మన్న పాలెం ఆర్చ్ దగ్గర ఆందోళన చేయనున్న ఉక్కు కార్మికులు

* అమరావతి: బుడమేరు ఆక్రమణలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు.. బుడమేరు లో ఆక్రమణల కారణంగానే విజయవాడ ముంపుకు గురైందని, వాగు ప్రవాహ విస్తీర్ణం పెంచాలని కోరిన పిటిషనర్.. రేపు విచారణకు వచ్చే అవకాశం

* విజయవాడ: ప్రకాశం బ్యారేజీ దగ్గర మూడు గేట్ల కౌంటర్ వెయిట్ లకి పూర్తయిన ఐరన్ స్క్రాప్ ఫిల్లింగ్.. మూడు గేట్ల కౌంటర్ వెయిట్లకి ఇవాళ కాంక్రీట్ ఫిల్లింగ్ చేయనున్న ఇంజనీర్లు

* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,030 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,476 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.6 కోట్లు

* గుంటూరు జిల్లా: నేడు మంగళగిరి కోర్టులో, మాజీ ఎంపీ నందిగం సురేష్ కస్టడీ పిటిషన్ పై విచారణ.. కస్టడీ పిటిషన్ పై కౌంటర్ ఫైల్ దాఖలు చేయనున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ తరపు న్యాయవాదులు

* విశాఖ స్టీల్ ప్లాంట్ లో వేగంగా మారు
తున్న పరిణామాలు… నేడు ఢిల్లీలో ఉక్కు మంత్రిత్వశాఖ కీలక భేటీ.. ఈ సమావేశం కంటే ముందే కీలక చర్యలు.. స్టీల్ ప్లాంట్ CMD అతుల్ భట్ ఔట్.. రిటైర్మెంట్ వరకు సెలవుపై వెళ్లాలని ఆదేశాలు.. ప్రస్తుతం వున్న డైరెక్టర్లకు కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ బాధ్యతలు….

* నేడు బెంగుళూరు నుంచి తాడేపల్లి రానున్న జగన్.. పలు కేసుల్లో అరెస్ట్ చేసి జైల్లో ఉన్న వైసీపీ నేతలను కలవనున్న జగన్

* ఖమ్మం: నేటి నుంచి ముంపు బాదితుల ఖాతా లో పది వేల రూపాయలు బ్యాంకు ల్లో జమ.. మున్నేరు వరద వల్ల నష్ట పోయిన బాధితులకు ఆర్థిక సహాయం.. 15055 ఇళ్లకు వరద చేరినట్లు రిపోర్ట్.. 146 ఇల్లు లు పూర్తిగా దెబ్బ తిన్నాయి.. జిల్లాలో 339 కోట్ల ఆర్థిక నష్టం.. వ్యవసాయ శాఖ కు 111 కోట్ల నష్టం

* ఖమ్మం: నేటి నుంచి వరదలో సర్టిఫికెట్స్‌ తడిసిన వారి కోసం ఖమ్మం నగరం లో ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ

Show comments