NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఢిల్లీ: నేటి నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పార్లమెంట్‌ మలివిడత బడ్జెట్‌ సమావేశాలు.. లోక్‌సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం

* హైదరాబాద్‌: ఉదయం 11 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌నాయక్

* BRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్న దాసోజు శ్రవణ్..

* హైదరాబాద్‌: నేడు పరిశ్రమల శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం.. ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్ కి హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి.. మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్, సిలిల్‌సఫ్లై శాఖల బడ్జెట్ పై సమావేశం

* అమరావతి: ఇవాళ ఉదయం 9 గంటలకు క్వశ్చన్ అవర్ తో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఆరోగ్య శ్రీ బకాయిలు.. అడుదాం ఆంధ్ర నిర్వహణ తీరు.. గిరిజన ప్రాంతాల్లో రేషన్ కార్డులపై సభ్యుల ప్రశ్నలు. తీర ప్రాంత టూరిజం అభివృద్ధి.. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ రహదారులు.. అన్నదాత సుఖీభవ పథకం అమలు పై ప్రశ్నలు. ఏపీలో కొత్త వైద్య కళాశాలలు.. ఎన్టీఆర్ వైద్య సేవపై స్వల్పకాలిక చర్చ.

* అమరావతి: ఇవాళ ఉదయం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ల నామినేషన్లు.. టీడీపీ నుంచి నామినేషన్ వెయ్యనున్న కావలి గ్రీష్మ.. బీద రవిచంద్ర.. బీటీ నాయుడు.

* అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లి వైసీపీ అధినేత వైఎస్ జగన్. మధ్యాహ్నం 4.20 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి ఫ్లైట్ లో 6.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. అనంతరం 7.10 గంటలకు తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకోనున్న జగన్..

* తిరుమల: శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో రోండోవ రోజు.. ఇవాళ శ్రీకృష్ణుని అవతారంలో తెప్పల పై విహరించనున్న స్వామివారు

* విజయవాడ: నేడు వల్లభనేని వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్లు.విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు

* నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన.. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పుస్తక ఆవిష్కరణ లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

* అనంతపురం : యాడికి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి చెన్న కేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమకార్యక్రమం,శేష వాహనం సేవ.

* అనంతపురం : యాడికి మండల కేంద్రం లోని శ్రీ లక్ష్మి చెన్న కేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో నేడు ఇరుసు పోటీలు.

* తూర్పుగోదావరి జిల్లా: నేడు కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణం.. భారీగా ఏర్పాట్లు.. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త చర్యలు.. రాజమండ్రి, గోకవరం ఆర్టీసీ డిపోల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు

* విజయనగరం జిల్లా గజపతినగరం లో నేడు గజపతినగరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య “యువత పోరు ” పోస్టర్ రిలీజ్ చేయునున్నారు

* పార్వతీపురం మన్యం జిల్లా: నేటి నుంచి కలెక్టర్ మరియు ఇతర మండల కార్యాలయంలో ప్రజా సమక్ష పరిష్కార వేదిక కార్యక్రమము ప్రారంభం

* విజయనగరం: మెంటాడ మండలంలో నేడు మెంటాడ తాసిల్దార్ కార్యాలయం వద్ద గుర్ల గెడ్డ రిజర్వాయిర్ గురించి తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వనున్నారు అఖిలపక్ష నేతలు.

* శ్రీ సత్యసాయి : కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామి వారి కల్యాణోత్సవం.హాజరుకానున్న మంత్రి నారాలోకేష్.

* కర్నూలు: నేడు పోసాని బెయిల్ పిటిషన్ పై కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టులో విచారణ.. పోసాని కస్టడీ పిటిషన్ పై ఇప్పటికే తీర్పు రిజర్వు చేసిన మేజిస్ట్రేట్.. 5 రోజులుగా కర్నూలు జైలులో ఉన్న పోసాని

* కర్నూలు: నేడు సి.బెళగల్ మండలం బురాన్ దొడ్డిలో శ్రీ గోకారమయ్య స్వాముల కిస్తీ మహోత్సవం

* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు స్వామివారికి మహా రుద్రాభిషేకం , సాయంత్రం పల్లకి సేవ

* నంద్యాల: రాయచోటి లోని వీరభద్ర స్వామి ఉత్సవం పై జరిగిన దాడిని నిరసిస్తూ నేడు నంద్యాలలో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ర్యాలీ

* నంద్యాల: బనగానపల్లె (మం) యాగంటి ఉమా మహేశ్వర స్వామి క్షేత్రంలో నేడు స్వామి అమ్మ వార్లకు బిల్వార్చన, రుద్రాభిషేకం, మహా మంగళహారతి

* నంద్యాల: నేడు ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా పొన్నచెట్టు వాహనం పై విహరించనున్న జ్వాలా నరసింహ స్వామి… నేడు దిగువ అహోబిలం లో ఉదయం మోహిని అలంకారం, సాయంత్రం శరభ వాహనం….

* తిరుమల: 10 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనంకు 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 79,478 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 26,667 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు

* అనకాపల్లి జిల్లా: నేడు గోవాడ షుగర్ ఫ్యాక్టరీనీ సందర్శించనున్న వైసీపీ నేతల బృందం.. తరచూ క్రషింగ్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు… చెరకు రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు వెళుతున్న వైసిపి ముఖ్య నాయకత్వం….

* నల్లగొండ జిల్లా: ప్రణయ్ పరువు హత్య కేసులో నేడు తుది తీర్పు వెల్లడించనున్న రెండవ అదనపు సెషన్స్, ఎస్సీ ఎస్టీ కోర్టు. సెప్టెంబర్ 14, 2018న మిర్యాలగూడలో దారుణహత్యకు గురైన ప్రణయ్

* నిర్మల్: నేడు జిల్లా కేంద్రం లో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. పాక్ పట్లలో పామాయిల్ పరిశ్రమ నిర్మాణంను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అడ్డుకుంటున్నారని , అభివృద్దిని అడ్డుకుంటున్న తీరు కి వ్యతిరేకంగా నిరసన కు పిలుపు.

* యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం.. పూర్ణాహుతిలో పాల్గొననున్న తెలంగాణ గవర్నర్