NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఇవాళ వయనాడ్‌లో ప్రధాని మోడీ పర్యటన.. ఉదయం 11 గంటలకు కన్నూర్ చేరుకోనున్న మోడీ.. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే.. సహాయ శిబిరం మరియు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించనున్న మోడీ.. అనంతరం సహాయ, పునరావాస చర్యలపై ప్రధాని మోడీ సమీక్ష

* ప.గో: నేడు భీమవరంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పర్యటన.. ఉదయం 9 గంటలకు ఫిషరీస్‌ అసోసియేషన్‌ బిల్డింగ్‌ను ప్రారంభించనున్న మంత్రి..

* ప్రకాశం : జిల్లా లోని పలు ప్రాంతాల్లో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి..

* ప్రకాశం: మంత్రి గొట్టిపాటి రవికుమార్ కారంచేడులో జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి విగ్రవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు..

* ప్రకాశం : దర్శిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించనున్న ఎమ్మెల్యే బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి..

* ప్రకాశం: మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం..

* ప్రకాశం: మార్కాపురంలోని కంభం రోడ్డు లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆళ్వారుల, ఆచార్యుల విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం..

* బాపట్ల : కారంచేడులో జాగర్లముడి కుప్పుస్వామి చౌదరి విగ్రహావిష్కరణ కార్యక్రమం, ముఖ్య అతిధులుగా హాజరుకానున్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, తెన్నేటి కృష్ణ ప్రసాద్..

* తిరుమల: 14వ తేదీన పవిత్రోత్సవాలకు అంకురార్పణ.. 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు

* నెల్లూరులో జరిగే జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పాల్గొననున్న రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి.. డాక్టర్ పొంగూరు నారాయణ

* నెల్లూరు: జిల్లాలో జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించనున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

* తూర్పుగోదావరి జిల్లా: ఉదయం 10 గంటలకు రాజమండ్రి ఎస్పీ గ్రౌండ్స్ నందు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కందుల దుర్గేష్.. ఉదయం 11 గంటలకు రాజమండ్రి కలెక్టరేట్ నందు రాష్ట్ర మైన్స్ & జియోలాజికల్ అధికారులతో సమావేశం.. మధ్యాహ్నం 3 గంటలకు నిడదవోలు నియోజకవర్గం మండల స్థాయి అధికారులతో మీటింగ్.. సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి బైపాస్ రోడ్ నందు రెల్లి కమ్యూనిటీ వారితో మీటింగ్ లో పాల్గొంటారు.

* అనంతపురం : మున్సిపల్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహాసభలు.

* శ్రీ సత్యసాయి : జిల్లాలో పర్యటించనున్న జిల్లా మంత్రులు సవితమ్మ , సత్యకుమార్.. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రులు.

* గుంటూరు: నేడు కలెక్టరేట్ సమీపంలో తపాలా కార్యాలయంలో, జాతీయ జెండా పతాక ప్రదర్శన.. కార్యక్రమానికి హాజరుకానున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..

* గుంటూరు : నేడు ఏపీ హైకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ ఆధ్వర్యంలో, వికలాంగ బాలుల హక్కుల పరిరక్షణపై ,రాష్ట్ర స్థాయి వార్షిక సమావేశం… గుంటూరు కలెక్టరేట్‌లోని శంకరన్ భవన్ లో జరగనున్న సమావేశం…

* తిరుపతి: ఈనెల 16 తేదీన పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం.. సాయంత్రం అమ్మవారికి స్వర్ణ రథోత్సవం..

* శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు.. జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల .. ఇన్ ఫ్లో 2,86,919 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 4,11,236 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 882.50 అడుగులు.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* నంద్యాల: అవుకు రిజర్వాయర్ తిమ్మరాజు బండ్ ను నేడు సందర్శించి గంగమ్మ తల్లికి జల హారతి సమర్పించనున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

* ప్రకాశం బ్యారేజీనుంచి సముద్రంలోకి 2,46,950 క్యూసెక్కుల విడుదల, కాలువలకు 14,357 క్యూసెక్కుల విడుదల.. మొత్తం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2,61,307 క్యూసెక్కులు.. బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులు.. 50 గేట్లను 6 అడుగులు, 20 గేట్లను 5 అడుగులు ఎత్తిన అధికారులు

* పోలవరం ప్రాజెక్టు వద్ద తగ్గిన గోదావరి వరద ప్రవాహం.. స్పిల్ వే వద్ద 30.9 మీటర్ల నీటిమట్టం.. 48 గేట్ల నుంచి 6లక్షల 50వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం

* తిరుమల: 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,131 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 30,998 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు

Show comments