ఆకాష్‌టీర్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. దాయాది దేశం పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ ప్రయోగించిన అత్యంత పవర్‌ఫుల్ వెపన్ సిస్టమ్. శత్రు దేశం గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టించింది. అంతేకాకుండా ప్రపంచ నిపుణులనే కలవర పెట్టింది. అంతగా ఆకాష్‌టీర్ తన ప్రతాపాన్ని శత్రు దేశంపై చూపించింది. అందుకే దీని గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చకు వచ్చింది.
ఇది కూడా చదవండి: India-Pak War: సింధు జలాలపై పాక్ లేఖ.. ఏం కోరిందంటే..!
ఆకాష్‌టీర్.. భారత స్వదేశీ పరిజ్ఞానంతో ఏఐ ఆధారితతో రూపొందించిన శక్తివంతమైన వాయు రక్షణ పర్యావరణ వ్యవస్థ. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇది ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను వ్యూహాత్మక కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌తో సన్నద్ధం చేస్తుంది. యుద్ధ ప్రాంతంలో తక్కువ స్థాయి గగనతలాన్ని పర్యవేక్షించడానికి, గ్రౌండ్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్‌లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది.
ఇది కూడా చదవండి: Operation Sindoor: భారీగా పాక్ వైమానిక వనరులు ధ్వంసం! ఏ స్థాయిలో అంటే..!
ఇటీవల భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టగా.. దానికి ప్రతీకారంగా పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. దీన్ని ఆకాష్‌టీర్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆకాష్‌టీర్ కారణంగా భారత్‌లో ఎలాంటి నష్టం జరగలేదు. అంతగా పాక్ డ్రోన్లను, క్షిపణులను అడ్డుకోగలిగింది. అందుకే దీని గురించి ప్రపంచ నిపుణులు చర్చించుకుంటున్నారు.
