NTV Telugu Site icon

Aadhaar-PAN Link: ఈ రోజు ఆధార్-పాన్ కార్డు లింక్ చేయకపోతే ఏం చేయాలి..? తెలుసుకోండి..

Aadhaar Pan Link, 

Aadhaar Pan Link, 

Aadhaar-PAN Link: దేశంలోని పన్ను చెల్లింపుదారులు జూన్ 30 లోగా తమ ఆధార్-పాన్ కార్డును లింక్ చేయాలి. ఐటీ డిపార్ట్మెంట్ ఈ పాన్ కార్డను ఆధార్ కార్డును లింక్ చేసే సమయాన్ని మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడగించింది. అయితే ఈ రెండు కార్డులను లింక్ చేయని వారు కొన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

పాన్-ఆధార్ కార్డ్ లింక్ ఎవరికి అవసరం:

ఆదాయపు పన్ను శాఖ, ఆదాయ పన్ను చట్టం 1961 చెబుతున్న దాని ప్రకారం.. జూలై 1, 2017 నాటికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ నెంబర్ ఉన్న వాళ్లంతా జూన్ 30లోగా ఈ రెండు కార్డులను లింక్ చేసుకోవాలి. అయితే ఎన్ఆర్ఐలు, 80 ఏళ్లకుపై బడినవారు, మేఘాలయ, అస్సాం, జమ్మూ కాశ్మీర్ నివాసితులు దీనికి మినహాయింపు. పన్ను ఎగవేతను అరికట్టేందుకు ఆధార్ కార్డ్, పాన్ కార్డు లింక్ చేయాలని అధికారులు చెబుతున్నారు.

జూన్ 30లోగా పాన్, ఆధార్ లింక్ చేసుకోని పన్ను చెల్లింపుదారులు వచ్చే నెలలో పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ పేర్కొంది. అటువంటి వ్యక్తుల పాన్ కార్డులు పనిచేయవు మరియు ఆధార్‌తో లింక్ చేయని పాన్‌లకు తిరిగి చెల్లింపు చేయబడదు. పాన్ పనిచేయకుండా ఉన్న కాలానికి వాపసుపై వడ్డీ కూడా చెల్లించబడదు. పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేయకుంటే.. టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్(TDS), టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్( TCS) తగ్గించడం లేదా ఎక్కువ రేటుతో వసూలు చేయబడుతుంది.

పెట్టుబడిదారులు తప్పకుండా ఆధార్ – పాన్ కార్డును లింక్ చేయాలి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, “సెక్యూరిటీస్ మార్కెట్‌లోని అన్ని లావాదేవీలకు పాన్ కీలక గుర్తింపు సంఖ్య కీలకం, ఇది KYC నిర్ధారణకు అవసరం కాబట్టి, అన్ని సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీలు, మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్‌లు (MIIలు) పాల్గొనే వారందరూ చెల్లుబాటు అయ్యే విధంగా KYCని నిర్ధారించడం అవసరం’’ అని తెలిపింది.

సెక్యూరిటీ మార్కెట్లో సజావుగా లావాదేవీలు కొనసాగించడానికి, ఇతర పరిణామాలను నివారించడానికి పెట్టుబడీదారులంతా తమ పాన్ ను అధార్ తో తప్పనిసరిగా లింక్ చేయాలని సర్క్యులర్ పేర్కొంది. పాన్, ఆధార్ లింక్ అయ్యే వరకు సెక్యూరిటీలు, ఇతర లావాదేవీలపై పరిమితులు విధించవచ్చు.

పాన్ కార్డ్ పనిచేయకుంటే ఏం చేయాలి..?

ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, రూ. 1,000 రుసుము చెల్లించిన తర్వాత నిర్ణీత అథారిటీకి ఆధార్ సమాచారం అందించిన 30 రోజుల తర్వాత మళ్లీ పాన్ కార్డు ఆపరేట్ చేయవచ్చు.

పాన్-ఆధార్ లింక్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి..?

మీరు ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించి, క్విక్ లింక్‌లను ఎంచుకోవచ్చు. ఆ తర్వాత లింక్ ఆధార్ స్టేటస్ పై క్లిక్ చేసి, కొత్త పేజీలో మీ పాన్ మరియు ఆధార్ నంబర్‌లను నమోదు చేయండి. మీ పాన్ మరియు ఆధార్ లింక్ చేయబడితే, ఒక మెసేజ్ పాప్ అప్ కనబడుతుంది. “మీ పాన్ ఇప్పటికే ఆధార్‌కి లింక్ చేయబడింది” అంటూ మెసేజ్ కనిపిస్తుంది. లేదంటే, పాప్-అప్‌లో, “పాన్ ఆధార్‌తో లింక్ చేయబడలేదు. మీ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయడానికి దయచేసి ‘లింక్ ఆధార్’పై క్లిక్ చేయండి”. అనే మేసేజ్ కనిపిస్తుంది. ఈరోజు పాన్ మరియు ఆధార్ లింక్ చేయడానికి ఒక వ్యక్తి ₹ 1,000 చెల్లించాలి.