Site icon NTV Telugu

NOTA: ఒక వేళ “నోటా”కు ఎక్కువ ఓట్లు వస్తే ఎలా..? ఈసీకి సుప్రీం నోటీసులు..

Nota

Nota

NOTA: భారతదేశ ఎన్నికల ప్రక్రియాలో ‘నోటా’కి కీలక స్థానం ఉంది. ఎన్నికల్లో తమకు నచ్చని అభ్యర్థి ఉంటే ఓటర్లు నన్ ఆఫ్ ది ఎబో(NOTA)కి ఓటేస్తారు. ఒకవేళ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే పరిస్థితి ఏంటనే సందేహం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

రచయిత, మోటివేషనల్ స్పీకర్ శివ్ ఖేరా దీనిపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని 5 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించడేలా నిబంధనలు రూపొందించాలని కోరారు. నోటాని ‘‘కల్పిత అభ్యర్థి’’గా సరైన, సమర్థవంతమైన ప్రచారాన్ని నిర్ధారించేలా నిబంధనలు రూపొందించాలని కోరారు. ఖేరా తరుపున సీనియన్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ వాదించారు.

Read Also: Sandeshkhali: కలకత్తా హైకోర్టు తీర్పుపై సుప్రీంలో మమత సర్కార్ పిటిషన్

ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడంతో సూరత్ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి విజేతగా ప్రకటించిన సందర్భాన్ని న్యాయవాది సుప్రీంకోర్టు ముందు ఉంచారు. ‘‘సూరత్‌లో ఒకే అభ్యర్థి బరిలో ఉండటంతో ఆయనని ఏకగ్రీవం చేశారు. అయితే ఓటర్లకు నోటా కోసం వెళ్లేందుకు ఎంపిక ఉండాలి కాబట్టి ఎన్నికలు జరగాలి’’అని పిటిషనర్ కోరారు.

ఈవీఎంలో నోటా ఆప్షన్ అనేది ఎన్నికల వ్యవస్థలో ఓటరు అభ్యర్థిని తిరస్కరించే హక్కు అని పిటిషనర్ పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌పై నోటీసు జారీ చేస్తూ, “ఇది ఎన్నికల ప్రక్రియకు సంబంధించినది కూడా. దీనిపై ఎన్నికల సంఘం ఏమి చెబుతుందో చూద్దాం” అని పేర్కొంది.

Exit mobile version