Air Pollution Crisis: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తీవ్ర వాయు కాలుష్యంతో ఇప్పటికే తీవ్ర అవస్థలు పడుతుండగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి ముంబై కూడా చేరినట్లైంది. గత కొన్ని రోజులుగా దేశ ఆర్థిక రాజధాని నగరంలో గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో పర్యావరణ వేత్తలు, ముంబై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా నగరా నికి ఏమైంది? దీనికి బాధ్యులెవరు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక, ఈ పరిస్థితిని నియంత్రించేందుకు రాష్ట్ర సర్కార్ తక్షణమే చర్యలు చేపట్టాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
కాగా, ముంబైలోని పలు ప్రాంతాల్లో అత్యంత కాలుష్యంగా నమోదు అయింది. బాంద్రా – కుర్లా కాంప్లెక్స్, బైకుల్లా, శివ్డీ, కొలాబా, శివాజీనగర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. గుండె జబ్బులు, ఆస్తమా, శ్వాస కోశ సమస్యలు, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పని సరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read Also: CWC Meeting: నేడు సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల నేతలు..
*వాయు కాలుష్య నియంత్రణకు సూచనలు..
* ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ఛాన్స్ ఉందని హెచ్చరించిన పర్యావరణ నిపుణులు
* ముంబై నగరంలో కాలుష్య నియంత్రణకు పలు సూచనలు చేసిన పర్యావరణ శాస్త్రవేత్తలు..
* పరిశ్రమల నుంచి వెలువడే వాయు మలినాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వెల్లడి..
* నగరంలో ట్రాఫిక్ నియంత్రణ ద్వారా వాహన కాలుష్యాన్ని తగ్గించే అవకాశం..
* పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్న పర్యావరణ నిపుణులు..
* వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ఆదేశాలు..