Site icon NTV Telugu

West Bengal: మేనల్లుడిని చంపిన అత్త.. అసలు కథేంటంటే..!

Murder

Murder

పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. ఒక మహిళ.. తన మేనల్లుడిని ముక్కలు.. ముక్కలుగా నరికి.. అవశేషాలను సిమెంట్ గోడలో వేసి కప్పేసింది. బాధితుడి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: IPL 2025 FINAL: అందరి టార్గెట్ ఒక్కడే..

పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాకు చెందిన మౌమిత అనే మహిళ తన మేనల్లుడు సద్దాం నాదాబ్‌తో సంబంధం కొనసాగిస్తోంది. మే 18 నుంచి సద్దాం జాడ కనిపించకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి మౌమితను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించింది. సద్దాంను చంపేసి.. శరీరాన్ని మూడు ముక్కలుగా చేసి తన తండ్రి ఇంట్లో సిమెంట్‌లో వేసి మూసేసినట్లు తెలిపింది. పోలీసులు.. దినాజ్‌పూర్ జిల్లాలోని తపన్ ప్రాంతంలోని ఇంటి నుంచి ప్లాస్టిక్ మరియు కాంక్రీటుతో చుట్టబడిన సద్దాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Yashaswini Reddy: కన్నీరు పెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.. కారణం ఏంటంటే?

బాధితుడు సద్దాం లేబర్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. లక్షల రూపాయుల ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. మే 18న స్కూటర్‌పై ఇంటి నుంచి బయల్దేరి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అయితే అతడు మాల్డాలో ఉంటున్న అత్త మౌమితా హసన్ నదాబ్‌తో సంబంధం పెట్టుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు కలిసి పని చేయడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే సద్దాం.. ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని అందుకే చంపేసినట్లు మౌమిత పోలీసులకు చెప్పింది. కానీ డబ్బుల వ్యవహారమే ఈ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడి దగ్గర లక్షల రూపాయులు ఉన్నాయని.. ఈ డబ్బు విషయంలోనే సద్దాం హత్యకు గురై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. మౌమిత భర్తను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version