Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్‌లో హింస..

  • బెంగాల్ రీపోలింగ్‌లో హింస..
  • అరాచకాలకు పాల్పడుతున్న టీఎంసీ నేతలు..
  • తమకు రక్షణ కల్పించాలని స్థానికుల ఆందోళన..
Bengal Elections

Bengal Elections

Bengal Elections 2026: మే 4న వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇదిలా ఉంటే రెండో దశలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో ఈ రోజు బెంగాల్‌లోని రెండు నియోజకవర్గాల్లోని 15 సెంటర్లలో రీపోలింగ్ నిర్వహించారు. అయితే, ఈ పోలింగ్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) గుండాలు అరాచకం సృష్టించారు. ముఖ్యంగా స్థానికుల్ని టార్గెట్ చేస్తూ హెచ్చరికలు చేశారు. దీంతో స్థానికులు ఆందోళన చేశారు. మగ్రాహత్ పశ్చిమ్, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లోని 15 బూత్‌లలో రీపోలింగ్ జరుగుతున్న తరుణంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి.

Read Also: Oscars 2027 Rule Changes: ఆస్కార్ చరిత్రలోనే అతిపెద్ద మార్పులు.. భారతీయ సినిమాలకు ఇక పండగే!

టీఎంసీ కార్యకర్తల నుంచి బెదిరింపులు వస్తున్నాయని స్థానికులు శనివారం దక్షిణ 24 పరగాణాల జిల్లాలోని ఫల్తాలో నిరసన చేపట్టారు. ఫల్తాలో తిరిగి పోలింగ్ నిర్వహించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. భద్రతను పెంచడానికి ఈ ఏరియాలో కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు. ఉద్రిక్తతలు పెరగడంతో కేంద్ర బలగాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. “వారు గెలిస్తే మా ఇళ్లను తగలబెట్టి, రక్తపాతం సృష్టిస్తామని టీఎంసీకి చెందిన ఇస్రాఫిల్ చౌకీదార్ మమ్మల్ని బెదిరించారు” అని ఒక మహిళ ఆరోపించింది. తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. స్థానిక టీఎంసీ నాయకులు బైకులపై గ్రామాల్లో్కి ప్రవేశించి ప్రజల్ని భయపెట్టారని, దాడి చేసి చంపేస్తామని హెచ్చరించారని మరొకరు ఫిర్యాదు చేశారు.