NTV Telugu Site icon

West Bengal: అపరాజిత బిల్లును రాష్ట్రపతికి పంపించిన గవర్నర్ బోస్

Westbengalgovernorcvanandab

Westbengalgovernorcvanandab

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. పోలీసుల విచారణపై ఆరోపణలు రావడంతో కోల్‌కతా హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశింది. ప్రస్తుతం ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తోంది.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు

ఇదిలా ఉంటే ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారడంతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అత్యాచార నిరోధక బిల్లును తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అపరాజిత బిల్లును ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘అపరాజిత ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ బిల్లు(పశ్చిమబెంగాల్‌ క్రిమినల్‌ లాస్‌ అండ్‌ అమెండ్‌మెంట్‌) 2024’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం దీనిని తీసుకువచ్చింది. సుదీర్ఘ చర్చ అనంతరం బీజేపీ సహా ప్రతిపక్షాలన్నీ ఈ బిల్లుకు మద్దతు పలకడంతో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ బిల్లులో ప్రాముఖ్యంగా అత్యాచారానికి గురైన బాధితులు మరణించినా.. కోమాలోకి వెళ్లిపోయినా దోషికి ఉరిశిక్ష విధిస్తారు. అత్యాచారానికి పాల్పడిన దోషులకు పెరోల్‌ లేని జీవితఖైదును విధిస్తారు.

ఇది కూడా చదవండి: Haryana: ఆప్ సంచలన నిర్ణయం.. ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయం!

అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం బిల్లు ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. గవర్నర్ సీవీ. ఆనంద బోస్ బిల్లును పరిశీలించిన తర్వాత.. ఆమోదం కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. రాష్ట్రపతి పరిశీలన తర్వాత అపరాజిత బిల్లు ఆమోదం పొందనుంది.