Governor CV Ananda Bose: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్ నేతలతో భేటీ కావచ్చని తెలుస్తోంది. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హస్పిటల్‌లో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై మమతా బెనర్జీ సర్కాన్ అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ కేసును కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారిస్తోంది. మరోవైపు బాధితురాలికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేస్తున్నారు.
Read Also: Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా అభివృద్ధి సాధిస్తారు
గవర్నర్ గత గురువారం ఆస్పత్రిని సందర్శించి వైద్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, గవర్నర్ మమతా బెనర్జీ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్య దిగజారుతోందని ఆరోపించారు. కోల్‌కతా పోలీసులు పనితీరుపై ఆయన సోమవారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసులో వారు అంతా తప్పుగా చేశారని అన్నారు. ప్రస్తుతం ఈ కేసుని సుప్రీంకోర్టు సమోటోగా తీసుకుంది. ఈ అంశం సుప్రీంకోర్టులో ఉందని, ఏదైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు.
