బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం హింస చెలరేగింది. బెంగాల్ లో చెలరేగిన హింసపై సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి. బెంగాల్‌లో చెలరేగిన హింసపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. టీఎంసీ సర్కార్‌లో జవాబుదారీతనం లోపించిందని గవర్నర్ పేర్కోన్నారు. హింస చోటు చేసుకున్న ప్రాంతాల్లో పర్యటిస్తానని గవర్నర్ ధన్‌కర్ పేర్కోన్నారు. బెంగాల్‌లో ఎక్కడైతే హింస చోటుచేసుకుందో ఆ ప్రాంతాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరినట్టు గవర్నర్ పేర్కోన్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేయకున్నా, అనుకున్న ప్రకారమే సొంత ఏర్పాట్లు చేసుకొని పర్యటిస్తానని బెంగాల్ గవర్నర్ పేర్కోన్నారు.