West Bengal: బెంగాల్‌లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- కౌంటింగ్‌కు ముందు కోల్‌కతాలో టీఎంసీ హైడ్రామా..
- స్ట్రాంగ్ రూం ముందు టీఎంసీ నేతల ఆందోళన..
- బీజేపీ బ్యాలెట్ తెరిచేందుకు యత్నించిందని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాతి రోజే హైడ్రామా చోటుచేసుకుంది. ఒక వైపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ ఈసారి గెలుస్తుందని జోస్యం చెబుతున్న తరుణంలో, మరోవైపు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) బెంగాల్‌లో హైడ్రామాకు తెరతీసింది. కోల్‌కతాలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం ముందు టీఎంసీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీ బ్యాలెట్ బాక్సుల్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిందని అన్నారు.
టీఎంసీ నేతలు శశి పంజా, కునాల్ ఘోష్ స్ట్రాంగ్ రూమ్ ముందు ధర్నాకు దిగారు. తమ ప్రతినిధులు లేకుండానే బాక్సులు తెరిచేందుకు బీజేపీ, ఎన్నికల సంఘం అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. లోపల కొందరు వ్యక్తులు పని చేస్తున్నట్లు మాకు సీసీటీవీ కెమెరాల్లో కనిపించిందని, మమ్మల్ని లోపలికి అనుమతించడం లేదని వారు అన్నారు.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
Read Also: Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
దీనికి ముందు, సీఎం మమతా బెనర్జీ 9 నిమిషాల వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంతా వట్టిదే అని, అవన్నీ బీజేపీ దిశానిర్దేశంతోనే నడుస్తున్నాయని ఆరోపించారు. తాము 220కి పైగా సీట్లలో గెలువబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. అయితే, కౌంటింగ్‌లో బీజేపీ గందరగోళం సృష్టించే అవకాశం ఉందని, టీఎంసీ కార్యకర్తలు, నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే, కోల్‌కతా స్ట్రాంగ్ రూం ఆందోళనకు మరికాసేపట్లో మమతా బెనర్జీ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.
#WATCH | West Bengal Elections 2026 | Kolkata: TMC leaders Shashi Panja and Kunal Ghosh sit on a dharna in front of the strong room, outside Netaji Indoor Stadium.
They alleged that attempts are being made by BJP and ECI officials to open boxes without the presence of relevant… pic.twitter.com/nAxlxZvZfY
— ANI (@ANI) April 30, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?