West Bengal Elections: రాత్రి వేళ బైక్‌లపై నిషేధం.. బెంగాల్‌లో భారీ ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal Elections: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఆంక్షలు విధించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, శాంతియుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడానికి బైక్ ర్యాలీలను నిషేధించడం, పగటిపూట వెనుక కూర్చొని ప్రయాణించడంపై పరిమితులు విధించింది. పోలింగ్‌కు రెండు రోజుల మందు నుంచి ఉంటే, మంగళవారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. ఏప్రిల్ 23న బెంగాల్‌లో 152 అసెంబ్లీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి.
Read Also: YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
Also Read
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
వైద్యారోగ్యం, కుటుంబ కార్యక్రమాల వంటి అత్యవసర పరిస్థితులకు మినహా, సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రోడ్లపై బైక్‌లు, స్కూటర్లను అనుమతించరు. బెదిరింపులు, ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగిస్తారనే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేసింది. బైక్ ర్యాలీలపై కూడా పూర్తిస్థాయి నిషేధాన్ని విధించింది. పగటి పూట ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య అత్యవసర పరిస్థితులు, పాఠశాలకు పిల్లల్ని దింపడం, తీసుకురావడం వంటి అత్యవసర పనులకు మినహా, బైక్ వెనకాల మరొకరు కూర్చోవడాన్ని నిషేధించారు.
పశ్చిమ బెంగాల్‌లో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని విధాల కృషి చేస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సోమవారం స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీకి లబ్ధి చేకూరేలా ఎన్నికల యంత్రాంగం ఉద్దేశపూర్వకంగా ఓటర్ల హక్కుల్ని రద్దు చేస్తోందని అధికార టీఎంసీ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!