పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తమ్ముడు అషిమ్ బెనర్జీ కరోనా కారణంగా మృతి చెందారు. బెంగాల్ లో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే బెంగాల్ లో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 136 మంది మృతి చెందారు. బెంగాల్ లో రేపటి నుంచి మే 30వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించారు. అత్యవసర సేవలను అనుమతించడంతో పాటు, అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 3 గంటలు దుకాణాలు తెరిచి ఉంచేలా ఆదేశాలు జారీచేసింది.
కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు కన్నుమూత
