NTV Telugu Site icon

Mamata Banerjee: నీతి ఆయోగ్ సమావేశం మధ్యలో నుంచే బెంగాల్ సీఎం మమతా వాకౌట్

Mamatha

Mamatha

Mamata Banerjee: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేసింది. సమావేశంలో మాట్లాడనివ్వకుండా తన మైక్ ఆఫ్ చేసారని ఆరోపించింది. నీతి ఆయోగ్ ను రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ తిరిగి తేవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సమావేశంలో 20 నిముషాలు మాట్లాడారు.. ఇతర నేతలు 15 నిముషాలు మాట్లాడారు.. విపక్షాల నుంచి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైందని నేను ఒక్కరినే.. కనీసం నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు.. కేంద్రం వివక్షా పూరితంగా వ్యవహరిస్తుంది.. కేంద్ర బడ్జెట్ రాజకీయంగా ఉంది అని సీఎం మమతా మండిపడింది. నీతి అయోగ్ సమావేశంలో నా మైక్ కట్ చేయడం అంటే.. బెంగాల్ ప్రజలను మాత్రమే కాదు అన్ని ప్రాంతీయ పార్టీలను కూడా అవమానించడమేనిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

Read Also: Allari Naresh : అల్లరోడి సితార సినిమా షూటింగ్ అప్ డేట్..రిలీజ్ ఎప్పుడంటే.?

ఇక, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఏకపక్ష కేటాయింపులు చేసిందంటూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. అలాగే, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా ఈ భేటీకి గైర్హజరు అయ్యారు. ఈ సమావేశానికి దూరంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సూఖు, కేరళ ముఖ్యమంతిర పినరయి విజయన్ లాంటి వారందరూ ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు.