NTV Telugu Site icon

NEET: బెంగాల్ అసెంబ్లీలో కీలక పరిణామం.. నీట్ రద్దు చేయాలని తీర్మానం

Neetexam

Neetexam

దేశ వ్యాప్తంగా 2024లో జరిగిన నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దు చేయాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే దీనిపై మంగళవారం సుప్రీంకోర్టు విచారించి కీలక తీర్పు వెలువరించింది. పరీక్ష రద్దుకు ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. ప్రశ్నపత్రం లీకేజీ వాస్తవమైనా అది విస్తృత స్థాయిలో జరగలేదని.. పిటిషన్లను ధర్మాసనం తిరస్కరించింది.

ఇది కూడా చదవండి: Mahesh – Rajamouli: కాస్కోండ్రా అబ్బాయిలూ.. ఇక డైరెక్ట్ ఎటాక్!

ఇక నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పశ్చిమబెంగాల్ అసెంబ్లీ కీలక తీర్మానం చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయాలని మమతా బెనర్జీ ప్రభుత్వం తీర్మానం చేసింది. గత వారమే.. నీట్‌ను రద్దు చేస్తూ కర్ణాటక కేబినెట్ తీర్మానం చేసింది. రాష్ట్రాలే సొంతంగా ఎగ్జామ్స్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోరారు. ఇప్పుడు అదే వరుసలో పశ్చిమ బెంగాల్ చేరింది. ఏకంగా నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీంతో బెంగాల్‌లో సొంతంగా మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: AP Assembly: లిక్కర్‌పై శ్వేతపత్రం.. పవన్‌ కల్యాణ్‌, విష్ణుకుమార్‌ రాజు సంచలన వ్యాఖ్యలు

2021లో తమిళనాడులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం కూడా నీట్ నుంచి మినహాయింపు కోరుతూ అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించింది. పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం కూడా ఇదే విధమైన ప్రయత్నం చేసింది. అయితే 2017లో బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందడంలో విఫలమైంది.

ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: మాజీ మంత్రి కాకాణిపై డిప్యూటీ సీఎం పవన్‌కు ఫిర్యాదు..